బోయకొండకు రూ.5 లక్షలు విరాళం

చౌడేపల్లె ముచ్చట్లు:

ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీబోయకొండ గంగమ్మ ఆలయంలో అన్నదానంకు రూ.5 లక్షలు విరాళం ఇచ్చినట్లు ఈవో చంద్రమౌళి, చైర్మన్‌ నాగరాజారెడ్డి ఆదివారం తెలిపారు. తిరుపతికి చెందిన బాలాజి అనే దాత బోయకొండలో అమ్మవారిని దర్శించుకుని, అన్నదానం కార్యక్రమానికి రూ.5 లక్షల చెక్కును విరాళంగా అందించారు. ఆలయ అభివృద్ధిని చూసి , ఉడుతభక్తిగా తమ వంతు సహాయాన్ని అందించామన్నారు. ఈ సందర్భంగా దాతలను చైర్మన్‌ , ఈవో కలసి అభినందించారు. ఈ కార్యక్రమంలోఆలయ డైరెక్టర్‌ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags; Donation of Rs.5 lakhs to Boyakonda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *