దొందూ… దొందే..

అప్పుల్లో తెలుగు రాష్ట్రాల పోటీ

న్యూఢిల్లీ ముచ్చట్లు:

అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు రెండూ ఒకే దారిలో నడుస్తున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన రాష్ట్రాల రుణాల జాబితాలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది మార్సి 31 నాటికి ఏపీకి 3లక్షల98 వేల 903 కోట్ల రూపాయల అప్పులు ఉంటే.. తెలంగాణకు 3 లక్షల 12 వేల 191 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి రాష్ట్రాల అప్పుల వివరాల గురించి ఎంపీ కిషన్ కపూర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వక  సమాధానం ఇచ్చారు.మూడేళ్లలో ఏయే రాష్ట్రం బహిరంగ మార్కెట్ నుంచి ఎంత మొత్తం రుణంగా తీసుకుందన్న విషయాన్ని కేంద్రం ప్రకటించింది.  బహిరంగ మార్కెట్ నుంచి మూడేళ్లలో తీసుకున్న రుణాలతో జాబితాను రూపొందించింది. బడ్జెటేతర రుణాలను మాత్రం కేంద్రం ఈ జాబితాలో పొందుపరచలేదు. బడ్జెట్ నుంచి అసలు, వడ్డీ చెల్లిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్రం తెలిపింది. ఏపీలో అప్పుల విషయానికి వస్తే.. 2020 మార్చి 31 నాటికి ఏపీ అప్పులు రూ.3,07,671 కోట్లుగా కాగా.. 2021 మార్చి 31 నాటికి ఏపీ అప్పులు రూ.3,60,333 కోట్లు. 2022 మార్చి 31 నాటికి ఏపీ అప్పులు రూ.3,98,903 కోట్లకు చేరాయని విత్త మంత్రి వెల్లడించారు.  రాష్ట్రాలు ఆర్ధిక క్రమశిక్ష పాటించకుండా, ఇష్టానుసారం అప్పులు చేసి ఆర్ధికవ్యవస్థను దెబ్బతీస్తున్నాయన్న విమర్శల నేపథ్యంలో.. ఏ రాష్ట్రం ఎంత అప్పు చేసిందో కేంద్రం వెల్లడించింది.  దేశంలో అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాను కేంద్రం పార్లమెంటులో బయటపెట్టింది. ఎంపీ కిశోర్‌ కపూర్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆ జాబితాను వెల్లడించారు.

 

 

ఆ జాబితా ప్రకారం దేశంలో అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రంగా తమిళనాడు మొదటి స్థానంలో, సిక్కిం చివరి స్థానంలో ఉంది.     తెలుగు రాష్ట్రాలలో ఏపీ 8వ స్థానం,  1తెలంగాణ1వ స్థానంలో ఉన్నట్లు తేలింది.దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల అప్పల వివరాల్లోకి వెళితే…తమినాడు- 6,59,868 లక్షల కోట్లు, ఉత్తర‌ప్రదేశ్- 6,53,307 లక్షల కోట్లు, మహారాష్ట్ర -6,08,999 లక్షల కోట్లు, పశ్చిమ బెంగాల్-5,62,697 లక్షల కోట్లు, రాజస్థాన్- 4,77,177 లక్షల కోట్లు,  కర్నాటక -4,62,832 లక్షల కోట్లు, గుజరాత్-4,02,785 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ -3,98,903 లక్షల కోట్లు,కేరళ్- 3,35,989 లక్షల కోట్లు,  మధ్యప్రదేశ్ 3,17,736 లక్షల కోట్లు, తెలంగాణ -3,12,191 లక్షల కోట్లు, పంజాబ్ -82,864 లక్షల కోట్లు,హర్యానా- 2,79,022 లక్షల కోట్లు, బీహార్ – 2,46,413 లక్షల కోట్లు, ఒడిశా-1,67,205 లక్షల కోట్లు, జార్ఖండ్ 1,17,789 లక్షల కోట్లు,  చత్తీస్‌ఘ‌డ్- 1,14,200 లక్షల కోట్లు, అస్సాం-1,07,719 లక్షల కోట్లు, ఉత్తరాఖండ్ -84,288 వేల కోట్లు, హిమాచల్ ప్రదేశ్ -74,686 వేల కోట్లు, గోవా- 28,509 వేలకోట్లు,  త్రిపుర -23,624 వేల కోట్లు, మేఘాలయ- 15,125 వేల కోట్లు, నాగాలాండ్- 15,125 వేల కోట్లు,  అరుణాచల్ ప్రదేశ్ -15,122 వేల కోట్లు, మణిపూర్ -13,510 వేలకోట్లు, మిజోరాం- 11,830 వేల కోట్లు, సిక్కిం -11,285 వేల కోట్లు.

 

Tags: Dondoo… Dondoo..

Leave A Reply

Your email address will not be published.