Donor contribution is appreciated

దాతల సహకారం అభినందనీయం

Date:08/05/2020

చౌడేపల్లి ముచ్చట్లు

కరోనావిపత్కర సమయంలో స్వీయ నియంత్రణ లో ఉన్న పేద కుటుంబాల వారికి చేయూత నివ్వడం అభినందనీయమని ఎంపీ అభ్యర్థి ఎంపిటిసి గాజుల రామ్మూర్తి పేర్కొన్నారు.శుక్రవారం చౌడేపల్లె మండలంలోని కొండయ్య గారి పల్లెలో దాత ఆ గ్రామానికి చెందిన కె కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీలోని సుమారు 350 కుటుంబాల వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం చిరస్మరణీయమని కొనియాడారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటికి ప్రజాప్రతినిధుల సహకారంతో సరుకులను అందజేయడం పేదలకు చేయూతగా ముందుకు రావడం చాలా సంతోషకరం అన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు అమరనాథ్, సోమశేఖర్, చిన్న, రెడ్డప్ప , అభి, తదితరులు పాల్గొన్నారు.

భయం గుప్పెట్లో రెండు పల్లెలు

Tags: Donor contribution is appreciated

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *