Date:28/03/2020
పుంగనూరు ముచ్చట్లు:
కరోనా వైరస్ నియంత్రణలో ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీసులకు, మున్సిపల్ కార్మికులకు పలువురు వివిధ రకాల సేవలు అందిస్తున్నారు. మున్సిపాలిటి మాజీ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, వైఎస్ఆర్సీపీ నాయకులు రాజశేఖర్, రెడ్డెప్ప, మునిరాజ కలసి పోలీసులకు భోజనం, వాటర్ బాటిళ్లను సీఐ గంగిరెడ్డి చేతులు మీదుగా పంపిణీ చేశారు. అలాగే పట్టణంలోని దివ్యజ్ఞాన మందిరం హెల్త్‌కేర్ సోసైటి వ్యవస్థాపకులు డాక్టర్ రమణ్‌రావు ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా మాస్క్‌లు, శానిటేజర్లు పంపిణీ చేశారు. పట్టణంలోని రోటరీక్లబ్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ జాన్ ఆధ్వర్యంలో సీఐ గంగిరెడ్డి చేతులు మీదుగా పోలీసులకు , హ్గం గార్డులకు మాస్క్ లు పంపిణీ చేశారు. అలాగే మాజీ కౌన్సిలర్లు ఇబ్రహిం, ఆసిఫ్, ఖాజా, అస్లాం కలసి రెండవ రోజు పేదలకు, కార్మికులకు, పోలీసులకు భోజనం పంపిణీ చేశారు. అలాగే పట్టణానికి చెందిన డాక్టర్ రమణరావు కమిషనర్ వర్మకు శానిటేజర్లు అందజేశారు. అలాగే మానవత సంస్థ ఆధ్వర్యంలో మజ్జగ, బిస్కెట్లు, మంచినీటి బాటిళ్లు, అరటిపండ్లు రెండవ రోజు కూడ పంపిణీ చేశారు. మోర్మార్కెట్ యాజమాన్యం కార్మికులకు డెటాల్, లైజాల్ బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ సురేంద్రబాబు, కార్మిక సంఘ నాయకుడు సప్ధర్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌ల కృషి ఫలితమే ఉపాధి కూలీలకు లబ్ధి
Tags: Donors serving the police and workers