నకిలీలతో నష్టపోయాం ఆదుకోండి
నంద్యాల ముచ్చట్లు:
నకిలీ పత్తి విత్తనాలతో నకిలీ మందుల బస్తాల తో నష్టపోయామని, తమను ఆదుకోవాలని నంద్యాల జిల్లాకు చెందిన పలువురు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గతంలో వామపక్ష పార్టీలతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు కూడా చేశారు. కానీ ఇంతవరకు ఎలాంటి నష్ట పరిహారం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకీలీ విత్తనాల వల్ల ఎకరాకు 2 నుంచి 3 క్వింటాళ్ల దిగుబడి సైతం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల పూత పిందె రాలేదన్నారు. అప్పు చేసి పత్తిసాగు చేస్తే నకిలీ విత్తనాల కారణంగా మోసపోయామని పేర్కొన్నారు. పత్తి విత్తనాలు సరఫరా చేసిన సదరు కంపెనీలపై చర్యలు తీసుకోవాలని, నష్టపరిహారం ఇప్పించాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు .అలాగే గత నాలుగు రోజుల క్రితం నూనెపల్లె ఎరువుల దూకాణంలో శ్రీ రంగాపురం గ్రామ రైతులు 40 బస్తాల డీఎపి ని కొనుగోలు చేశారు . అవి పొలంలో సల్లుతుంటే రాళ్లు. మట్టి పెడలు. దుమ్ము ధూళి కలిగి ఉన్నాయన్నారు. వెంటనే రైతులు గమనించి బస్తాలను వెనుకకు తెచ్చి షాపు ముందు పోసి నిరసన వ్యక్తం చేశారు.
ఇవన్నీ జరుగుతున్న అగ్రికల్చర్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని రైతుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. విజిలెన్స్ అధికారులు దాడులు తప్పితే తప్ప అగ్రికల్చర్ అధికారులు దాడులు చేయడం లేదని రైతులు విమర్శిస్తున్నారు . అధికారుల నిర్లక్ష్యం వల్లే నకిలీ విత్తనాలు ఎరువులు నంద్యాల లో తయారు అవుతున్నాయని తెలిపారు . తెలుగు రాష్ట్రలలో నకిలీ విత్తనాలు ఎక్కడ దొరికిన నంద్యాల అనే పేరే వినిపిస్తోందన్నారు . నూనెపల్లె ఎక్కువగా కల్తీలకు పురిటి గడ్డగా పేరుందని పలువురు రైతులు పేర్కొంటున్నారు . కలెక్టర్ అపీస్. అగ్రికల్చర్ అపీస్ లు నూనెపల్లెలోనే ఉన్నాయి కానీ ఎన్ని అపీస్ లు ఉన్నా కల్తీలు ఆగడంలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు . కనీసం వచ్చే సంవత్సరం లోనైనా కల్తీ లేని విత్తనాలు ఎరువులు సరఫరా చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.

Tags: Don’t be fooled by fakes
