Don't be fooled by unapproved layouts

అనుమతి లేని లేఔట్లతో మోసపోవద్దు

Date:30/06/2020

బి.కొత్తకోట ముచ్చట్లు:

ప్రభుత్వ, గ్రామ పంచాయతీ అనుమతులు లేని లేఔట్ లలో స్థలాలు కొని మోసపోవద్దు అని కొనుగోలు దారులకు చిత్తూరు జిల్లా గ్రామీణ, పట్టణ ప్రణాళిక అధికారి కె. ఆర్.మధు విజ్ఞప్తి చేశారు.మంగళవారం ఆయన బి.కొత్తకోటలో పర్యటించారు.స్థానిక దేవుల చేరువురోడ్డులో పట్టణానికి చెందిన నిర్మించనున్న కళ్యాణ మండపం స్థలాన్ని,ప్లాన్ ను పరిశీలించారు. ఆతరువాత స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో బిల్డింగ్ అప్రూవల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ బి.కొత్తకోట త్వరలోనే మున్సిపాలిటీ కానుందని, కనుక ప్రభుత్వ, పంచాయతి అనుమతి పొందిన లేఔట్ లలో ఇంటి స్థలాలు కొనుగోలు చేస్తే స్థలాల కొనుగోలు దారులకు, భవన యజమానులకు బహుళ ప్రయోజనాలు ఉంటాయని ముఖ్యంగా 33 అడుగుల వెడల్పుతో రోడ్స్ వుంటాయని, నీళ్ల ట్యాంక్ నిర్మాణము మురికి నీటి కాలువల నిర్మాణం విద్యుత్ సౌకర్యం అన్ని కూడ కలిగి ఉంటాయని అందువలన ప్లాట్స్ కొనుగోలు దారులకు మంచి ప్రయోజనం ఉంటుందన్నారు. అలా కాకుండ పంచాయతి అనుమతులు లేని లేఔట్ లలో ఇండ్ల స్థలాలు కొనుగోలు చేస్తే భవన నిర్మాణ సమయంలో ప్లాన్ అప్రూవల్ కోసం రిజిస్ట్రేషన్ ఫీజులో 14 శాతం అదనంగా స్థలం కొనుగోలు చేసిన కొనుగోలు దారే భరించాల్సి ఉంటుందన్నారు.అంతేకాకుండా సన్నపాటి రోడ్స్ కు ఎప్పటికీ ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు.సామాజిక అవసరాలకు ఏది నిర్మించాలన్నా ఆ ప్రాంతంలో కనీస స్థలం ఉండదన్నారు. కనుక ఇప్పటికైనా ఇళ్ల నిర్మాణం కోసం భవన నిర్మానాల కోసం స్థలాలు కొనుగోలు చేసేవారు సంబంధిత లేఔట్ గ్రామ పంచాయతీ అనుమతి పొందివుందా లేదా అనే విషయం తెలుసుకుని పంచాయతి అనుమతి పొందిన లేఔట్ లలోనే స్థలాలు కొని ప్రయోజనం పొందాలని కొనుగోలు దారులకు విజ్ఞప్తి చేశారు. అనధికారికంగా లేఔట్ లు వేసిన రియలేస్తేట్ వ్యాపారులు భూయజమానులు వెంటనే గ్రామపంచాయతీ అనుమతి తీసుకోవాలని అలా తీసుకోకుండా అక్రమంగా లేఔట్స్ వేసే వారి పై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ సర్వేయర్ పవన్ కుమార్, పట్టణ ప్రణాళిక సహాయ అధికారిని చంద్రమ్మ,సహాయ అధికారి కనక నరసారెడ్డి, బి.కొత్తకోట ఈ ఓ పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

భార‌త్-చైనా: మూడోసారి చ‌ర్చ‌లు ప్రారంభం!

Tags: Don’t be fooled by unapproved layouts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *