Natyam ad

కాంగ్రెస్ వారి కల్లబొల్లి మాటలను నమ్మవద్దు

కొడంగల్ ముచ్చట్లు:


మద్దూరు మండలం నందిపాడు, లక్కయ్యపల్లి మాలలో రాష్ట్ర మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయన కు  మహిళలు, రైతులు, యువకులు ఆట పాటలతో స్వాగతం పలికారు. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కేవలం ఎన్నికల అప్పుడు వచ్చి మభ్యపెడుతున్న  కాంగ్రెస్ వారి కల్లబొల్లి మాటలను నమ్మవద్దు. 24 గంటల కరెంటు ఇచ్చే బిఆర్ఎస్ పార్టీ కావాలా మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా ప్రజలు ఆలోచించుకోవాలి. రోజు మీ,  మీ ఇంటి ముందు ఉండే నరేందర్ రెడ్డి కావాలా గాలి మోటర్ లో తిరిగి 10 ఏళ్లకు పది సార్లు కోడంగల్ మొహం చూడని రేవంత్ రెడ్డి కావాలా ఆలోచించుకోవాలనిఅన్నారు. అభివృద్ధి చేసే టిఆర్ఎస్ పార్టీ కావాలా బెదిరించి దాడులు చేసి పైసలతో కొంటాం అంటున్న కాంగ్రెస్ కావాలా ప్రజలు ఆలోచించాలి. ఈనెల 22న కోసిలో జరిగే సీఎం కేసీఆర్ ప్రజా దీవెనసభ ను పెద్ద ఎత్తున ప్రజలు హాజరై విజయవంతం చేయాలని అన్నారు.

 

Tags: Don’t believe Congress’s hype

Post Midle
Post Midle