Don't believe myths about coronavirus

కరోనా వైరస్ పై వస్తున్న అపోహలు నమ్మోద్దు

మహిళా కార్మికులను వారి స్వగ్రామాలకు పంపెందుకు ఏర్పాట్లు చేస్తున్నాం

👉-శ్రీసిటీ డిఎస్పీ విమల కుమారి

Date:25/03/2020

చిత్తూరు ముచ్చట్లు:

👉చిత్తూరు జిల్లా శ్రీసిటీ డిఎస్పీ విమలకుమారి తాజా పరిణామాలపై స్పందిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు.ప్రజలు సంపూర్ణ ఆరోగ్యం కల్గిఉండాలని దేవుని ప్రార్ధిస్తున్నానన్నారు.శ్రీసిటీ పారిశ్రామిక వాడలోని రైజింగ్ స్టార్ మొబైల్ పరిశ్రమ,హీరో పరిశ్రమల్లో పనిచేస్తూ హాస్టల్స్ లో ఉంటున్న మహిళా కార్మికులను వారి స్వంత గ్రామాలకు పంపెందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.శ్రీసిటీ యాజమాన్యం,పరిశ్రమల యాజమాన్యంతో చర్ఛిస్తున్నామనీ,ఉన్నతాధికారులు డిజీపి,ఎస్పీ ఆదేశానుసారం ప్రత్యేక బస్సుల్లో మహిళా కార్మికులను తరలిస్తామన్నారు.కరోనా వైరస్ పై వస్తున్న అపోహలను నమ్మోద్దని కోరారు.మహిళా కార్మికులు వారి తల్లిదండ్రుల వద్ధకు చేరుకోవాలనే ఆందోళన తప్పా ఎవరికికూడా అనారోగ్యానికి గురికాలేదని అన్నారు.మహిళా కార్మికులకు భరోషా కల్పిస్తూ మాట్లాడామని భయపడాల్సిన అవసరం లేదన్నారు.అధేవిదంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలకు ప్రజలు పోలీస్ లకు సహకరించాలన్నారు.అత్యవసర సమయాల్లో తప్పా బయటకు రావద్ధని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో సి.ఐ. జగదీష్ నాయక్, ఎస్సై అరుణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో కరోనా వైరస్ అరికట్టడం కోసం మాస్కులు

Tags: Don’t believe myths about coronavirus

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *