Natyam ad

పిల్లలను ఎత్తుకెళ్ళే వారు వచ్చారన్న వదంతులను నమ్మవద్దు-జిల్లా ఎస్.పి  కే.కే.ఎన్ అన్బురాజన్

పోలీసులకు సమాచారం అందించాలి

కడప ముచ్చట్లు:


కడప జిల్లాలో పిల్లలను ఎత్తుకెళ్ళే వారు వచ్చారన్న వదంతులను నమ్మవద్దని జిల్లా ఎస్.పి  కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ పేర్కొన్నారు. జిల్లా ఎస్.పి ఆదేశం మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన వారు దూరప్రాంతానికి విహార యాత్రకు వెళుతూ పోరుమామిళ్లకు వచ్చారని, వారు కిడ్నాపర్లు కాదని ఎస్.పి తెలిపారు. అనుమానితులు ఎక్కడైనా కనిపిస్తే డయల్ 100 కు లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్.పి కె.కె.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ సూచించారు. అనుమానితులపై దాడులు చేయవద్దని జిల్లా ఎస్.పి తెలిపారు.

 

Post Midle

Tags: Don’t believe rumors of child abductors: District SP KKN Anburajan

Post Midle