ప్రభుత్వ ఇళ్ల కోసం ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దు: కేటీఆర్‌

Date:20/07/2019

సిరిసిల్ల ముచ్చట్లు :

ప్రభుత్వ ఇళ్ల కోసం ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఆశావహులు ఎక్కువగా ఉన్న చోట లాటరీ తీసి ఇళ్లను కేటాయిస్తామన్నారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన రెండు పడక గదుల ఇళ్లను త్వరలోనే లబ్ధిదారులకు అందిస్తామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పింఛన్లను 5 రెట్లకు పెంచుకున్నామని అన్నారు. బీడీ కార్మికులకు కూడా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.

 

 

 

 

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆసరా పింఛన్ల ఉత్వర్వుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన సిరిసిల్లలో ప్రారంభించారు. ఈ సందర్భంగా  కేటీఆర్‌ మాట్లాడుతూ.. పింఛను అర్హత వయస్సు తగ్గింపు కూడా జూన్‌ నెల నుంచే వర్తిస్తుందని వెల్లడించారు. బీడీ కార్మికులకు పీఎఫ్‌ కటాఫ్‌ తేదీని తగ్గించడంతో కొత్తగా 2 లక్షల మందికి పింఛను అందుతుందన్నారు.

 

 

 

 

 

17 శాతం వృద్ధిరేటుతో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుందని గుర్తు చేశారు.గృహనిర్మాణాల గురించి మాట్లాడుతూ.. పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల కింద విడుదల చేయాల్సిన రూ.65 కోట్లను త్వరలోనే విడుదల చేస్తామని ఈ సందర్భంగా కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

నీటిని వృధా చేస్తే భారీ జ‌రిమానాలు

Tags: Don’t give anyone a single rupee for government houses: KTR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *