బిడ్డకు బుడ్డి పాలొద్దు…..తల్లిపాలే శ్రేయస్కరం

— పుట్టిన గంటలోపు ముర్రుపాలు పట్టించాలి
— చిన్నపిల్లలజాగ్రత్తలపై అవగాహన

చౌడేపల్లె ముచ్చట్లు:


బిడ్డలకు బుడ్డిపాలొద్దు తల్లిపాలు పట్టించడంతో బిడ్డకు చాలా శ్రేయస్కరమని ఐసీడిఎస్‌ సూపర్‌వైజర్‌ సులోచన అన్నారు. సోమవారం తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని చింతమాకులపల్లె,బయ్యప్పల్లె ,ఖాన్‌సాబ్‌మిట్ట , అంగన్‌వాడీ కేంద్రంలో తల్లులకు అవగాహన సదస్సు జరిగింది. సమావేశంలో ఆమె మాట్లాడుతూ బిడ్డ జన్మించిన గంట లోపు ముర్రుపాలు తాగించడం వలన వ్యాధినిరోదకశక్తి వస్తుందన్నారు. అలాగే ఐదేళ్ళ వరకు వేయించాల్సిన వ్యాక్సిన్‌ల ప్రాముఖ్యతను వివరించారు. గర్భవతులుగా ఉన్న సమయంలో నాణ్యమైన పౌష్టిక ఆహారం తినాలన్నారు. తద్వరా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతం జన్మనిస్తారని సూచించారు. రక్తహీనత వలన తల్లీబిడ్డలకు ప్రమాదం సంబవించే అవకాశం ఉందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం గర్భిణీలు,పిల్లలు, కిషోరబాలికలకు పంపిణీ చేసే పౌష్టిక ఆహారాన్ని సక్రమంగా అందజేయడంతోపాటు, వాటివలన కలిగే లాభాలనుప్రజలకువివరించాలని సిబ్బందికు సూచించారు. చిన్నపిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలను వివరించారు.

 

Tags: Don’t give baby breast milk…..breast milk is better

Leave A Reply

Your email address will not be published.