ఓటర్ల సర్వేకు తప్పుడు సమాచారం ఇవ్వద్దు

Don't give false information to voters' survey

Don't give false information to voters' survey

– కమిషనర్‌ కెఎల్‌. వర్మ

Date:22/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలో జరుగుతున్న ఇంటింటా ఓర్ల సర్వే కార్యక్రమంలో ప్రజలు అధికారులకు సక్రమమైన సమాచారం ఇవ్వాలని కమిషనర్‌ కెఎల్‌.వర్మ సూచించారు. మంగళవారం పట్టణంలో జరుగుతున్న ఇంటింటా ఓటర్ల సమాగ్ర సమాచార సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో 24 వార్డుల్లో 39,364 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వీరిలో ఇప్పటి వరకు 21,875 మంది ఓటర్ల జాబితాను నేరుగా పరిశీలించడం జరిగిందన్నారు. మిగిలిన ఓటర్ల పరిశీలన కార్యక్రమం ఈనెలాఖరులోపు పూర్తి చేస్తామన్నారు. మున్సిపాలిటి పరిధిలో బిఎల్‌వోలకు, వలంటీర్లు సర్వేలు సక్రమంగా నిర్వహించాలన్నారు. కొంత మంది వలంటీర్లు నిర్లక్ష్యంగా సర్వేలు నిర్వహిస్తున్నట్లు , ఆ సమాచారాన్ని బిఎల్‌వోలకు అందజేయడంతో ఓటర్ల సమగ్ర సమాచార కరెక్ట్గా అందకుండపోతోందన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, తప్పుడు సమాచారాలు అందించిన తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఓటర్ల సమగ్రసర్వేకు ప్రతి ఒక్కరు సహకరించి, సమగ్రంగా జాబితాలు రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

మునిసిపల్ ఎన్నికలకు కోర్టు గ్రీన్ సిగ్నల్

Tags: Don’t give false information to voters’ survey

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *