బార్లకు పోతే రాని కరోనా..! బడికి పోతే వస్తుందా..?

దశలవారీగా విద్యాసంస్థలను ప్రారంభించాలి
బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గాజుల నాగరాజు

జగిత్యాల    ముచ్చట్లు:

బార్ల కేమో ఆఫ్ లైన్.. విద్యాసంస్థలకు మాత్రం ఆన్లైనా.. అని బార్లకు పోతే రాని కరోనా..! బడికి పోతే వస్తుందా.. బిసి సంక్షేమ సంఘం జిల్లా  అధ్యక్షుడు గాజుల నాగరాజు ఎద్దేవా చేశారు.దశలవారీగా విద్యాసంస్థలను ప్రారంభించాలన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా సాకుతో విద్యాసంస్థలను తెరవకుండా ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం కూడా ఆన్లైన్ వైపు మొగ్గు చూపుతుందని, ధనవంతుల పిల్లలు కంప్యూటర్లు, ట్యాబుల ద్వారా  పాఠాలు వింటుంటే, ప్రభుత్వ పాఠశాలలో చదివే 26 లక్షల మంది పేద విద్యార్థులు మాత్రం ఆన్లైన్ పాఠాలకు నోచుకోవడం లేదన్నారు. కరోనా వ్యాక్సిన్లను తక్షణమే ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు, ప్రొఫెసర్లకు ఇవ్వాలని, 18 ఏళ్లు నిండిన ప్రతి విద్యార్థికి వ్యాక్సిన్ వేయాలని, కార్పోరేట్ విద్యా సంస్థలను పూర్తిగా నియంత్రించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే డీఎస్సీ నోటిఫికేషన్ వేసి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని జే ఎల్, డిఎల్ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుతున్న 40 లక్షల మంది పేద విద్యార్థులకు కంప్యూటర్లు, ట్యాబ్ లు,  స్మార్ట్ ఫోన్లు ప్రభుత్వమే సమకూర్చాలని ప్రభుత్వ పాఠశాలలను కుదించకుండా ఢిల్లీ తరహాలో కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలను నిర్మించి మౌలిక వసతులను కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు గాజుల నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి భార్గవ్ రామ్, జిల్లా కార్యదర్శి కోరెపు మల్లేశం, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గంగాధర నరేష్, ధర్మపురి నియోజకవర్గ అధ్యక్షులు ఓరుగంటి పెద్దిరాజు, నాయకులు మెడ పట్ల చంద్రయ్య, చిలువేరి గంగరాజం, దేవయ్య లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Don’t go to bars, Corona ..! If you go to bondage, will you come ..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *