పుంగనూరు మున్సిపాలిటిలో హామిలు నేరవేర్చి గడప గడపకు -చైర్మన్ అలీమ్బాషా
పుంగనూరు ముచ్చట్లు:
ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఎన్నికల పాదయాత్రలో ఇచ్చిన హామిలను అమలు చేసి గడప గడపకు వెళ్లి ప్రజలను విచారిస్తున్నామని మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా తెలిపారు. మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని 9వ వార్డులోని చంద్రకాంత్వీధి, గోకుల్వీధి, పోలీస్వీధి, యూబికాంపౌండు, రహమత్నగర్ ప్రాంతాలలో కమిషనర్ నరసింహప్రసాద్రెడ్డి, రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, మంత్రి పీఏ చంద్రహాస్తో కలసి చైర్మన్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగనన్న సంక్షేమ బావుట బుక్లెట్లను పంపిణీ చేశారు. చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో పార్టీలకు, కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అర్హులైన పేదలందరికి అందించడం జరిగిందన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల సమస్యలను ఇండ్ల వద్దనే పరిష్కరించి, ఆదర్శమైన మున్సిపాలిటిగా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు నాగేంద్ర, లలిత, కౌన్సిలర్లు కమలమ్మ, జయభారతి, అమ్ము, కిజర్ఖాన్, నరసింహులు,కాళిదాసు, జెపి.యాదవ్, నటరాజ, సుప్రియ, రేష్మా,సాజిదా, ఆదిలక్ష్మీ, మమత, యువకుమారి , తుంగామంజునాథ్, పిఎల్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Don’t let criminals commit crimes in Punganur Municipality – Chairman Aleem Basha
