వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దు -నాగబాబు

హైద్రాబాద్ ముచ్చట్లు:

ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని నాగబాబు అన్నారు. కూటమి నేతలు, జనసైనికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ‘వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి ఈసీకి సహకరిద్దాం. వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దు. మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. కచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది’ అని Xలో నాగబాబు వీడియో రిలీజ్ చేశారు.

 

Tags: Don’t respond to YCP’s provocative actions – Nagababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *