Natyam ad

పెండింగ్‌ సమస్యలు గుర్తించేందుకు గడప గడపకు – ఎంపీపీ భాస్కర్‌రెడ్డి.

పుంగనూరు ముచ్చట్లు:

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పరిష్కారం కానీ సమస్యలను కూడ గుర్తించి పరిష్కరించే కార్యక్రమం చేపట్టినట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని వనమలదిన్నె పంచాయతీ మిర్జేపల్లె, నాయకురాళ్ళపల్లి, బసివినాయుపల్లె, కొత్తూరు గ్రామాల్లో గడప గడపకు కార్యక్రమాన్ని పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌తో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎంపీపీ ఆధ్వర్యంలో సంక్షేమబావుట పుస్తకాలను పంపిణీ చేశారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల ఆధ్వర్యంలో అర్హులైన పేదలందరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, కాలువలు, మంచినీటి పథకాలు, ఆర్‌వోఆర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యానికి అగ్రస్థానం కల్పించడం జరిగిందన్నారు. ప్రజలు వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మునస్వామి, ఎంపీటీసీ సూరప్ప, వైఎస్సార్‌సీపీ నాయకులు దే శిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, రాజశేఖర్‌రెడ్డి, శంకరప్ప, నారాయణరెడ్డి, పెద్దరెడ్డెప్ప, రామచంద్రారెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Don’t spend time to identify pending issues – MPP Bhaskar Reddy.

Post Midle

Leave A Reply

Your email address will not be published.