బాలల భవిష్యత్తును కాలరాయకండి – సీనియర్‌ సివిల్‌జడ్జి వాసుదేవరావు

పుంగనూరు ముచ్చట్లు:

పేదరికంలో ఉన్న చిన్నపిల్లలను పాఠశాలలకు పంపాలని , వారిని కార్మికులుగా పంపి వారి భవిష్యత్తును కాలరాయవద్దని సీనియర్‌ సివిల్‌జడ్జి వాసుదేవరావు పిలుపునిచ్చారు. శనివారం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి కార్తీక్‌, అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి సిందుతో కలసి బాల కార్మికులను నిర్మూలన చేయాలని మహిళలతో కలసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వాసుదేవరావు మాట్లాడుతూ పనులలో వినియోగిస్తున్న బాలురను ప్రతి ఒక్కరిని గుర్తించి , పాఠశాలలకు పంపాలని లేదా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు తరలించేలా తల్లిదండ్రులలో అవగాహన కల్పించాలన్నారు. అలాగే మైనర్‌ బాలికలకు వివాహాలు చేయడం, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడటం నేరమన్నారు. ఇలాంటి విషయాలపై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు శివశంకర్‌నాయుడు, న్యాయవాదులు విజయకుమార్‌, విజయకృష్ణ, సీఐ రాఘవరెడ్డి, ఎస్‌ఐ సుకుమార్‌ , ఐసిడిఎస్‌ పీవో రాజేశ్వరితో పాటు మహిళలు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Don’t write the future of children – Senior Civil Judge Vasudeva Rao

Post Midle