Natyam ad

పశువులు పాలు ఇచ్చేది తెలియదా కిరణ్‌ – వైఎస్సార్‌సీపీ నేతల ఎద్దెవ 

పుంగనూరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి పశువులు, వాటి  జీవనశైలిపై కూడ అవగాహన లేని దద్దమ్మ కిరణ్‌కుమార్‌రెడ్డి అని వైఎస్సార్‌సీపీ నాయకులు వ్యంగస్త్రలు సందించారు. సోమవారం పుంగనూరు పర్యటనలో కిరణ్‌కుమార్‌రెడ్డి పశువులు నాలుగేళ్లు పాలిస్తుందని చెప్పడం, ఆపాల డబ్బు దోపిడి చేస్తున్నారనడం, ఇందుకు కట్టుకథనలు చెప్పడంతో నవ్వులపాలైయ్యారు. దీనిపై ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, బోయకొండ ఆలయ చైర్మన్‌ నాగరాజారెడ్డి, సచివాలయాల కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డిలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ  ముఖ్యమంత్రిగా జిల్లాను అభివృద్ధి చేయకపోగా , పైగా కట్టుకథలు, మాయమాటలతో ప్రజలను మోసగిస్తే కిరణ్‌కు తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు జిల్లాలో ఉండి పుంగనూరు అభివృద్ధి చేయలేదన్నారు. కిరణ్‌ అసత్య ఆరోపణలు మానుకోవాలని, లేకపోతే చూస్తూ ఊరుకోమన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వందల కోట్లు పుంగనూరుకు కేటాయించారన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఐదేళ్లలో ఊహించని అభివృద్ది జరిగిందని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో కిరణ్‌కు డిపాజిట్లు కూడ రావని, మతతత్వ పార్టీలతో ఉమ్మడి పోరాటానికి వస్తున్న అభ్యర్థులను ప్రజలు చిత్తుగా ఓడిస్తారని తెలిపారు.

 

Post Midle

Tags: Don’t you know that cows give milk Kiran – YSRCP leader’s bull

Post Midle