Natyam ad

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చెబుతూ ఇంటి ఇంటి ప్రచారం  

మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ను భారీ మెజార్టీ తో గెలిపించాలి
కాంగ్రెస్ పార్టీ లింగాల యూత్ మండల అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ రాథోడ్

నాగర్ కర్నూల్ ముచ్చట్లు:

Post Midle

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ను భారీ మెజార్టీ తో గెలిపించాలనీ కాంగ్రెస్ పార్టీ లింగాల యూత్ మండల అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ రాథోడ్ అన్నారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా లోని లింగాల మండలం దరారం గ్రామంలో ఇంటి ఇంటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. అచ్చంపేట నియోజకవర్గం లో భారీ మెజార్టీ తో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు పోరాడాలని పిలుపునిచ్చారు. నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో ప్రతి నోట కాంగ్రెస్ ఆస్తం గుర్తు పలికే విధంగా ఓటర్లను చైతన్యం చేయాలన్నారు. మన నల్లమల్ల ముద్దు బిడ్డ డాక్టర్  చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే గా గెలిచిన వెంటనే మన ప్రాంతం బాగుపడే విధంగా అభివృద్ధి పనులు చేస్తారని, అందుకు బీ ఆర్ ఎస్ పార్టీ నీ చిత్తులో ఓడించాలని అన్నారు. అచ్చంపేట ప్రాంతానికి సాగునీరు తెచ్చామని గొప్పలు చెప్పుకుంటునారు తప్ప చేసింది ఏమి లేదని ,అమ్రాబాద్ బాల్మూర్ మండలాలకు చుక్క నీరు రాలేదని, లింగాల మండలము లో 75 శాతం గ్రామాలకు నీరు రాక ప్రజలు పొలాలు బీడుగా ఉనాయనారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుల కష్టాలు తిరుతయన్నరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సోనియమ్మ కృషి పలితంగా మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యిందన్నారు.
కేసిఆర్ కుటుంబ పలనానే తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదని కోరారు. భారీ మెజార్టీతో మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కు చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం మేనిఫెస్టో కరపత్రాలను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీశైలం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Tags: Door to door campaign by telling Congress party manifesto

Post Midle