చౌడేపల్లెలో నవరత్నాలతో ఇంటింటికీ సంక్షేమం
చౌడేపల్లె ముచ్చట్లు:
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాలతో సంక్షేమ పథకాలు కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఇంటింటికీ అందుతున్నాయని జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, ఎంపీపీ రామమూర్తిలు అన్నారు. బుధవారం మండలంలోని నాగిరెడ్డిపల్లె, కోటూరు,పెద్దకొండామర్రి గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికనేతలు, అధికారులతో కలిసి గ్రామాల్లోని 498ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికీ లక్ష నుంచి ఏడు లక్షల వరకు లబ్దిచేకూరింన్నారు. జగనన్న ప్రభుత్వంలో ఎన్నికల మేనిఫెస్టోలోని 95 శాతం హామీలను అమలు చేశామన్నారు. ప్రజా సమస్యలను అడిగితెలుసుకొని వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమం కొనసాగింది.అనంతరం ఓటీ ఎస్ లబ్దిదారులకు దృవీకరణ పత్రాలతో పాటు, మూడేళ్ల పాలనలో లబ్దిపొందిన వివరాలతో కూడిన బావుటా పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పిఏ మునితుకారం, బోయకొండ కమిటీ చైర్మన్ మిద్దింటి శంకర్‌నారాయణ,పాల ఏకరి సంఘ రాష్ట్ర డైరక్టర్ లడ్డూరమణ, వైస్ ఎంపీపీలు నరసింహులు యాదవ్, సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు అంజిబాబు, రుక్మిణమ్మ, రెడ్డిప్రకాష్, సింగిల్‌విండో చైర్మన్ రవిరెడ్డి, సర్పంచ్ జయసుధమ్మ, ఎంపీటీసీ షాహీనా, పీహెచ్‌సీ కమిటి చైర్మన్ కళ్యాణ్, కోఆప్షన్‌మెంబరు సాధిక్, డిసిసిబి డైరక్టర్‌లు రమేష్‌బాబు, యోగానంద,నేతలు నాగభూషణరెడ్డి,తిమ్మారెడ్డి, రాజారెడ్డి, గిరిబాబు, తదితరులున్నారు.

Tags: Door-to-door welfare with Navratnas in Chaudepalle
