పికాషన్ డోసు తప్పనిసరిగా వేసుకోవాలి
చౌడేపల్లె ముచ్చట్లు:
కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రికాషన్ డోసు లు మూడు తప్పనిసరిగా వేసుకోవాలని వైద్యాధికారి పవన్‌కుమార్ సూచించారు. శుక్రవారం సచివాలయంలో మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ, పీహెచ్సీ కమిటి చైర్మన్ కళ్యాణ్భరత్ల చే ప్రికాషన్ డోసుల వాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.జూలై15 నుంచి 75 రోజులపాటు ఆజాదీకా అమృత్ మహ్గత్సవ్లో భాగంగా ప్రకాషన్డోసు 3 డోసులు 18 యేళ్లనుంచి 59 యేళ్లలోపు గల వారందరికీ వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రూపారేఖ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Tags: Dose of pication must be taken