దోస్త్ అడ్మిషన్లు షురూ…

Date:11/08/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

కరోనా కారణంగా వాయిదా పడిన డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. ఈ మేరకు సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఆగ‌స్టు 20 నుంచి దోస్త్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలుపెట్టాలని నిర్ణయించారు. ఆగ‌స్టు 12న పూర్తి షెడ్యూల్‌ విడుదల చేయనున్నారు.అయితే.. ఇప్పటివరకు 30 శాతం యాజమాన్య కోటా, 10 శాతం ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) కోటాపై ప్రభుత్వం జీఓ జారీ చేయనందున ఈసారి దోస్త్‌లో అవి అమలవుతాయా లేదా అన్నది సందిగ్ధంగా ఉంది.ఇక రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆగ‌స్టు 17 నుంచి డిజిటల్‌ తరగతులు ప్రారంభించనున్నారు. టీవీలతోపాటు యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా పాఠాలను ప్రసారం చేస్తారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలను సెప్టెంబరు 1వ తేదీ తర్వాత చేపట్టాలని నిర్ణయించారు.
6-10 వరకు డిజిటల్‌ పాఠాలు

 

 

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 6-10 తరగతుల విద్యార్థులకు ఆగ‌స్టు 20 నుంచి టీశాట్‌ ఛానెళ్లు, దూరదర్శన్‌ యాదగిరి ఛానెల్‌ ద్వారా రికార్డు చేసిన పాఠాల ప్రసారాన్ని (డిజిటల్‌ పాఠాలు) ప్రారంభిస్తారు. 3-5 తరగతులకు సెప్టెంబరు 1 నుంచి డిజిటల్‌ పాఠాలు మొదలవుతాయి. వీరికి రికార్డు చేసిన పాఠాలు కాకుండా లైవ్‌ పాఠాలను బోధిస్తారు. అంటే ఉపాధ్యాయులు టీవీ స్టూడియోలకు వెళ్లి తరగతి గదిలో మాదిరిగా బోధిస్తుంటే దాన్ని ప్రసారం చేస్తారు.ఇక 1, 2 తరగతులకు సంబంధించి డిజిటల్‌ పాఠాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. చిన్న పిల్లలైనందున వారికి డిజిటల్‌ పాఠాలు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఏ తరగతికి ఎన్ని గంటలపాటు తరగతులు ఉంటాయన్నది రెండు రోజుల్లో ఖరారు చేస్తారు.

వరంగల్ లో మెట్రో…

Tags: Dost admissions start …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *