Dotted looking corn

చుక్కలు చూస్తున్న మొక్కజొన్న

 Date:09/04/2020

శ్రీకాకుళం ముచ్చట్లు:

 

కరోనా వైరస్ జిల్లా మొక్కజొన్న రైతులకు చుక్కలు చూపిస్తోంది. ధరలు గణనీయంగా పడిపోయాయి. అవి రోజురోజుకీ తగ్గుతుండటంతో కర్షకులు ఢీలా పడిపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో దాదాపు 50 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగయింది. నవంబరు నుంచి డిసెంబరు ఆఖరు వరకు సాగు చేశారు. మడ్డువలసవంశధార ప్రాజెక్టుల్లో నీటి లభ్యత మేరకు ఎక్కువ మంది రైతులు ఈ పంట సాగుకు మక్కువ చూపారు. గతంలో కురిసిన వర్షాలకు చెరువుల్లో నీటిని ఇందుకు అనుగుణంగా మలుచుకున్నారు.

 

 

రాజాంసంతకవిటిరేగిడి ఆమదాలవలసపొందూరుజి.సిగడాంశ్రీకాకుళం గారఎచ్చెర్ల తదితర ప్రాంతాల్లో విస్తారంగా సాగు చేశారు. పంట ఇప్పుడు కోతకొస్తోంది. ఎకరానికి కనీసం 30 క్వింటాళ్ల నుంచి గరిష్ఠంగా 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఇంతకు ముందు ప్రభుత్వ మద్దతు ధరతో సంబంధం లేకుండా.. మార్కెట్టులో అధికంగానే ధరలు ఉండేవి. మద్దతు ధర క్వింటాలు రూ.1650లు ఉన్నప్పుడు కూడా.. బహిరంగ మార్కెట్టులో రూ.2,300లకు వరకు కొనుగోలు చేశారు. ఈ ఖరీఫ్‌లో సాగుచేసిన దిగుబడులకు సంబంధించి జనవరిడిసెంబరుల్లో ఇంచుమించు అవే ధరలు నిలకడగా సాగాయి. ప్రస్తుతం మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది.

 

 

 

ధర బాగుందని.. ధరలు బాగుండటంతో ఈ రబీలో మొక్కజొన్న వైపు ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపారు. సరిగ్గా పంట చేతికొస్తుందనగానే కరోనా వైరస్‌ ప్రభావం ప్రత్యక్షంగా కనిపించింది. మొక్కజొన్న ధర కుదేలైంది. ప్రస్తుతం క్వింటాలుకు మద్దతు ధర రూ.1,760లు. ఇంతకంటే తక్కువకే మార్కెట్టులో అమ్మకాలు సాగుతున్నాయి. దాదాపుగా రూ.2,200-2300 దగ్గర మొదలైన కొనుగోళ్లు రెండుమూడు రోజులు కూడా గడవకుండానే.. కొవిడ్‌-19 ప్రభావంతో అమాంతంగా రూ.1100లకు పడిపోయాయి.

 

 

 

తరవాత క్రమంగా రూ.1200ల నుంచి రూ.1500ల వరకు పెరుగుతూ వచ్చినా.. సొమ్ములు ఎప్పుడిస్తారో… ఎకరాకు అన్ని ఖర్చులు కలిపి దాదాపు రూ.20 వేల వరకు పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు. అంతా సవ్యంగా ఉంటే గరిష్ఠంగా 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. రూ.2300 ధర ఉంటే.. ఎంతలేదన్నా.. రూ.80 వేల ఆదాయం వస్తుంది. పెట్టుబడి పోను రూ.60 వేల వరకు మిగులుతుంది. ప్రస్తుతం సరాసరి క్వింటాలు ధర రూ.1500 అనుకున్నా… వస్తుందనుకున్న ఆదాయంలోనే ఎకరాకు రూ.30వేల వరకు కోల్పోవాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

 

 పౌల్ట్రీఫారాల్లో కోడికి ఉపయోగించే దాణాలో రొయ్య వ్యర్థాలు తదితర పదార్థాలతో పాటు మొక్కజొన్న అతి ముఖ్యమైనది. రాష్ట్రంలో పలు హేచరీస్‌ సంస్థలు సొంతంగానే దాణాను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ సంస్థలు భారీగా కొంటే పంటకు మంచి ధర ఉండేది. ప్రస్తుతం కోడి ధరలు పడిపోవటంతో పరిస్థితి మారిపోయింది.  జిల్లాలో ఈ రబీలో 15 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. క్వింటాలు ధర రూ.2300 ఉంటే.. జిల్లా రైతులకు రూ.345 కోట్ల మేర ఆదాయం సమకూరేది.

 

 

 

 

ప్రస్తుతం రూ.1500కు దగ్గరలో ధర ఉంటే చేతికందే ఆదాయం రూ.225 కోట్లే. ఆ లెక్కన జిల్లా రైతు దాదాపుగా ఈ రబీలో రూ.120 కోట్ల ఆదాయం కోల్పోయే పరిస్థితి తలెత్తిందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో వైపు వాతావరణ పరిస్థితులు కూడా కలవరపెడుతున్న తరుణంలో ధరలు తగ్గకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతులు విన్నవిస్తున్నారు.

కోసేవారేరీ..?

Tags: Dotted looking corn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *