సుప్రీం కోర్టులో ఏబీఎన్ చానల్ కు చుక్కెదురు

ఢిల్లీముచ్చట్లు:

 

సుప్రీంకోర్టులో ఏబీఎన్‌ ఛానల్‌కు చుక్కెదురయ్యింది. ఏబీఎన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఏపీ సీఐడీ పెట్టిన కేసు దర్యాప్తుపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. రఘురామకృష్ణరాజుతో పాటు ఏబీఎన్‌, టీవీ5పై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఏపీ సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ ఏబీఎన్‌ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఏబీఎన్‌పై కేసును సీఐడీ దర్యాప్తు చేసుకోవచ్చని.. దర్యాప్తు పూర్తయ్యేవరకు తీవ్ర చర్యలు వద్దని సుప్రీంకోర్టు పేర్కొంది. విచారణను ఆరు వారాలకు కోర్టు వాయిదా వేసింది. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలా? వద్దా? అన్నది అప్పుడు విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Dotted to ABN channel in Supreme Court

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *