రెట్టింపైన మద్యం అమ్మకాలు

-ఎక్కడికక్కడ దొరుకుతున్న డబ్బుల కట్టలు
Date:09/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో డబ్బు, మద్యం తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేయడానికి ఎంత ఖర్చు చేస్తున్నారో తెలియడం లేదు.
ప్రచారంలో పాల్గొనాలన్న కనీసం రోజుకు అభ్య ర్థిని బట్టి రూ. 500 నుంచి రూ. 1,000 వరకూ సమర్పించాల్సిందేనని దీనికి మద్యం ఖరీదైన భోజనం అదనమని తెలుస్తోంది. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇదే పంథాను అనుసరిస్తుం డడంతో ఈనెల 12వ తేదీ నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి పోలింగ్ జరిగే ఏడో తేదీ వరకూ కోట్లాది రూపాయలు వ్యయం అవుతుందని మద్యం కూడా ఏరులా పారే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యాని స్తున్నారు.
ప్రచారం బహిరంగసభల పరిస్థితి ఈ విధంగా ఉంటే గ్రామల్లో కల డ్వాక్రా సంఘాలు, మహిళాసంఘాలు, యువజన సంఘాలకు లక్షలాది రూపాయలు ఆశచూపుతారని రాష్ట్రంలో గల 31 జిల్లాల్లో రాజకీయ పార్టీలు వెచ్చించే ఎన్నికల వ్యయం వేలకోట్ల రూపాయలకు చేరుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 6వ తేదీన రాష్ట్ర శాసనసభ రద్దు చేసి టీఆర్‌ఎస్ పార్టీ 105 మంది అభ్యర్థులను ప్రకటించిన వెంటనే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఒక్క సారిగా వేడెక్కింది. టీఆర్‌ఎస్ పార్టీ తొలి ప్రచార సభను సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో ప్రారంభించడంతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. టిక్కెట్లు లభించిన అభ్యర్థులందరూ ఎన్నికల ప్రచార సభల ద్వారా గ్రామ గ్రామాలను చుట్టేస్తున్నారు. కుల సంఘాలు, సామాజిక సంఘాల సభ్యులతో సమావే శాలు నిర్వహించి తమకే ఓట్లు వేయాలని కోరుతూ ప్రచారం సాగిస్తున్నారు.
ఈ ప్రచార సభల్లో పాల్గొనే వారికి అవసరమైన సౌకర్యాలు కలుగజేస్తున్నారు.అయితే అప్పటి నుంచి ఇతర రాజకీయ పార్టీలు కూడా సభలు, సమావేశాలతో ఓటర్లను ఆకర్షించడానికి శ్రీకారం చుట్టాయి. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించకపోయినా ఎన్నికల ప్రచారాన్ని బహిరంగసభల ద్వారా ప్రారంభించింది. డబ్బు పంపిణీ ఈ విధంగా ఉంటే మద్యం, ఇతర మత్తు మందు పదార్థాల పంపిణీ కూడా జోరుగా ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. మద్యం అమ్మకాలు గణనీయంగా పెరగడంతో పాటు గంజాయి అమ్మకాలు కూడా బాగా జరుగుతున్నా యని తెలుస్తోంది.
గత సంవత్సరం అక్టోబర్ నెలలో రాష్ట్రంలో రూ. 1799 కోట్లు మద్యం విక్రయాలు జరుగగా ఈ సంవత్సరం రూ. 2,073 కోట్లు అమ్మకాలు జరిగి రూ. 300 కోట్లు అదనపు మద్యం విక్రయమైంది. ఎన్నికల హంగామా మొదలు కావడం తో మద్యం అమ్మకాలు పెరిగాయని, నామినేషన్లు దాఖలు ప్రారంభమైతే ఇది మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు అసెంబ్లీ రద్దయి ‘కోడ్’ అమలులోకి వచ్చిన తరువాత పట్టు పడుతున్న డబ్బు, మద్యం లెక్కలు చూస్తే ఈ ఎన్నికలు ‘దేశంలోనే ఖరీదైన ఎన్నికలు’ కావడంలో సందేహం లేదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
2014వ సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో భాగంగా ఎన్నికలు జరిగితే సుమారు రూ. 75 కోట్లు అధికారులు స్వాధీనం చేసుకుంటే ఈ ఎన్నికల్లో ఇంతవరకూ రూ. 72 కోట్లు విలువైన మద్యం, డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం పోలీసులు, ఆదాయపన్నుశాఖ అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండడంతో అక్రమంగా రవాణా అవుతున్న డబ్బు వెలుగు చూస్తోంది.ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి నామినే షన్లు దాఖలై ప్రచారం ప్రారంభించిన తరువాత డబ్బులు, మద్యం పంపిణీ మరింత ఊపందుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతు న్నారు.
ఓటర్లను ఆకర్షించడానికి నామినేషన్లు దాఖలు చేసిననాటి నుంచి ఓటింగ్ రోజు వరకూ రాజకీయ పార్టీలు రకరకాల ప్రలోభాలతో సిద్ధమవడం తెలి సిందే. అయితే ఈదఫా ఎన్నికలు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో డబ్బు విచ్చలవిడిగా పంపిణీ జరుగడానికి అవకాశం ఉండగా, మద్యం ఏరులై పారడానికి అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మద్యం అమ్మకాల్లో గత సంవత్సరం కంటే ఈ సెప్టెంబరు నెలలో 14.8 శాతం మద్యం విక్రయాలు అదనంగా జరగగా, అక్టోబర్ నెలలో 16.53 శాతం అమ్మకాలు పెరిగి సుమారు రూ. 300 కోట్లు అదనపు మద్యం విక్రయాలు జరగడం విశేషం.గ్రామాల్లో తమ నుంచి ఓటర్లు జారి పోకుండా చూడడానికి ఆ గ్రామాలల్లో వివిధ సంఘాల నాయకు లకు, కిందిస్థాయి నుంచి ఒక మోస్తరు నాయకుల వరకూ కాపాడుకోవడానికి సామ, దాన, దండోపా యాలను ఉపయోగిస్తూ నానాపాట్లు పడుతున్నారు.
ఈ తతంగం అంతటినీ పూర్తి చేయడానికి చాలా వరకూ డబ్బు వ్యయం అవుతోందని తెలుస్తోంది. ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనాలంటే మద్యం, డబ్బు రోజువారీ చెల్లించాల్సి వస్తోందని పోలింగ్‌కు ముందు ఇచ్చే తాయిలాలకు ఇది అదనమని పలువురు రాజకీయ పార్టీ నాయకులు వ్యాఖ్యాని స్తున్నారు. ప్రచారంలో పాల్గొనాలన్న, బహిరంగసభకు రావాలన్నా ప్రజలకు రాజకీయ పార్టీ అభ్యర్థులు డబ్బులు, మద్యం ఆశచూపిస్తున్నారని దీంతో అన్ని రాజకీయపార్టీలకు చెందిన ప్రచారంలో పాల్గొనాలన్న బహిరంగ సభలకు హాజరుకావాలన్నా డబ్బు, మద్యం సమర్పించుకోవలసిందేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికల సమ యంలో నిఘా ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశ్యంతో స్థానికంగాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాష్ట్రంలోకి వస్తోందని ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు మద్యం నిల్వల విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిసింది. ఏదిఏమైనా ఈ ఎన్నికలలో మద్యం, డబ్బు జోరుగా పంపిణీ అయ్యి ఖరీదైన ఎన్నికలుగా నిలిచిపోతాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags: Double alcohol sales

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *