“గూడు” పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టివ్వాలి

– కేసిఆర్ ఎన్నికల హామీని  నిలబెట్టుకోవాలి
-జగిత్యాల డిసిసి అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ డిమాండ్

Date:19/09/2020

జగిత్యాల ముచ్చట్లు:

ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 ఎన్నికల్లో ఇళ్లు లేని నిరుపేదలందరికి డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో శనివారం ఆయన టిపిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శి బండ శంకర్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కల్లెపల్లి దుర్గయ్య లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ హాయాంలో నిర్మించిన ఇందిరమ్మ కాలనీల్లో ఇప్పటికీ పేదలు నివసిస్తున్నారని గుర్తు చేస్తూ వీటిపై అవహేళనగా మాట్లాడిన కేసిఆర్ మీరు నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లల్లో నాణ్యత ప్రమాణాలు పాటీస్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో డబుల్ బెడ్ రూం ఇళ్లపై చర్చిస్తే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోక్యం చేసుకుని   హైదరాబాద్ జంట నగరాల్లో లక్ష ఇళ్లు నిర్మించామని రేపు మీకు వాటిని చూపిస్తామని చెప్పి భట్టి విక్రమార్క ను మరుసటి రోజు తీసుకుని వెళ్లి చూపిస్తే నాణ్యత లేకుండా నిర్మాణాలు ఉఝడడంతౌ ప్రభుత్వం అసలు రంగు బయటపడిందని విమర్శించారు. మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పినట్లు లక్ష ఇళ్ల నిర్మాణాలు లేవని కేవలం 3వేల నుంచి 4వేలు నిర్మించారని భట్టి విక్రమార్క తెలుపడంతో   మంత్రి అక్కడినుంచి జారుకున్నారని  తెలిపారు. జగిత్యాల జిల్లాలో ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల, మిగతా రెండు కొంతమేర ఉన్న నియోజకవర్గాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయో, ఎన్ని నిర్మాణాలు చేపట్టారో జిల్లాకు చెందిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే లు డాక్టర్ సంజయ్ కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావులు  ప్రజలకు వివరించాలని లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు 4 వేల వరకు పేదలు ఇళ్లకోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 3నుంచి 4వందల ఇళ్ల నిర్మాణాలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారని డిసిసి అధ్యక్షులు   తీవ్ర స్థాయిలో ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. జగిత్యాల సమీపంలోని నూకపల్లిలో ఆనాడు రోడ్లు భవనాల శాఖ మంత్రి గా ఉన్న ప్రస్తుత పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి నిరుపేదలకు గృహవసతి కల్పించాలనే సదుద్దేశంతో  ప్రభుత్వ స్థలం అక్కడ  సరిపోకపోవడంతో ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కొనుగోలు చేసి 4వేల ఇళ్లకు ముగ్గులు పోశారని వాటిని టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ 2014,2018ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని , ముఖ్యంగా  దరఖాస్తు చేసుకున్న అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని , అలాగే జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ సైతం మాట నిలబెట్టుకోవాలని   లక్ష్మణ్ కుమార్ సూచించారు.
ఈసమావేశంలో మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్,  కాంగ్రెస్ నాయకులు కమాలొద్దిన్, మహిపాల్, వెంకటేష్, చిట్ల విజయ్ కుమార్,లైసెట్టి విజయ్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

వర్షాలకు దెబ్బతిన్న వంతెనల నిర్మాణాలు చేపట్టాలి

Tags: Double bedroom houses should be built for all the “nest” poor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *