కర్ణాటకలో డబుల్ ఇంజిన్..
ఇక్కడి పథకాలు అక్కడ ఎందుకు లేవు..
రు.2016 పింఛన్, కల్యాణ లక్ష్మి, పంట పెట్టుబడి ఎందుకు ఇవ్వడం లేదు..
బిజేపి అంటేనే జూటా పార్టీ, జూటా మాటలు..
ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు..
నారాయణ్ ఖేడ్ ముచ్చట్లు:

పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ లోని కంగ్టి మండలానికి వచ్చిన మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్ కు ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. రు. 1.65 కోట్లతో దెగుల్వాడి నుండి తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేసారు.
ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో నాణ్యత లేని పనులు చేసి బిల్లులు లేవట్టే వారు. కానీ టి ఆర్ ఎస్ హయాంలో నాణ్యతతో కూడుకున్న పనులు మీకు కనిపిస్తాయి. గత 5 ఏళ్లలో రు. 36 కోట్లతో రోడ్లు ఏర్పాటు చేశాం. 54 తండాలు గ్రామ పంచాయతీలు చేశాం. కొత్త బిల్డింగ్ కు 25 లక్షలు శాంక్షన్ చేయబోతున్నాం. మరిన్ని రోడ్లకు బీటీ శాంక్షన్ చేస్తాం. తండాల్లో త్రీ ఫేస్ కనెక్షన్ ఇప్పించాము. 70 ఏళ్లలో కనీసం ఒక్క గిరిజన పాటశాల లేదు. భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక నాలుగు మీకు వచ్చాయి. గిరిజన బిడ్డలు డాక్టర్లు, ఇంజినీర్లు అవుతున్నారు. మంచినీళ్ళ కోసం ఇక్కడి ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారు. నీళ్ళు మోసి భుజాలు కాయలు కాసేవి. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు అందిస్తున్నారు.
రైతులకు ఎలాంటి కష్టం ఉండకూడదని పంట పెట్టుబడి సాయం ఇస్తున్నాము. కర్ణాటకలో ఏముంది. రైతు బంధు ఉందా, రైతు బీమా ఉందా, కల్యాణ లక్ష్మి ఉందా.. పక్కన కర్ణాటకలో డబుల్ ఇంజిన్.. ఎందుకు 500 పించన్ ఇస్తున్నారు. ఇక్కడి లాగే ఎందుకు 2016 ఇవ్వడం లేదు. కాన్పు కావాలంటే నాడు బీదర్ పోయేవాళ్ళు.. ఇప్పుడు కర్ణాటక నుండి ఇక్కడికి వస్తున్నారు. నారాయణ్ ఖెడ్ లో భవిషత్ లో టి డయాగ్నొస్టిక్ తీసుకువస్తామనిఅన్నారు.
స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు గిరిజన పల్లెలు ఎలా ఉండే ఇప్పుడు ఎలా మారి పోయాయి. అభివృద్ధి కళ్ళ ముందే కనిపిస్తున్నది. ఎస్టీ ప్రజల చిరకాల ఆకాంక్షను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. రాష్ట్రంలోని అన్నిగూడెంలు,తండాలను గ్రామపంచాయతీలుగా మార్చింది మన సీఎం గారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3146 మంది ఎస్టీలు కొత్తగా సర్పంచులు అయ్యారు. ఎస్టీ సంక్షేమం కోసం బడ్జెట్ లో 600 కోట్లు పెట్టుకున్నాం. అన్ని తండాలకు రోడ్లు వేస్తాము. సీఎం కేసీఆర్ కి గిరిజనులు అంటే ఎంతో ప్రేమ. ఎస్టీ సంక్షేమం కోసం ఎంతో చేస్తున్నారు. గురుకులాలు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు మనకు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు.
Tags: Double engine in Karnataka..
