124 నెలల్లో డబ్బులు రెట్టింపు

హైదరాబాద్ ముచ్చట్లు:


భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో కొత్త పథకాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న పలు పథకాల వల్ల ఎంతో మంది లబ్ది పొందారు..అయితే డబ్బును డబుల్ చేసుకోవాలంటే మాత్రం పోస్టాఫీసు లో స్కీమ్స్ బెస్ట్ అని చెప్పాలి..పోస్టాఫీసుల్లో కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికెట్ల రూపంలో పొదుపు పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు.ఇది నిర్ణీత వ్యవధి 124 నెలల తర్వాత మీ పెట్టుబడిని రెట్టింపు చేయడానికి రూపొందించబడిన స్థిర రేటు చిన్న పొదుపు పథకం. మీరు పథకంలో కేవలం రూ. 1000తో ప్రారంభించవచ్చు. ఇందులో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. ఈ పథకంలో ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం డబ్బు 124 నెలల్లో రెట్టింపు అవుతుంది. కిసాన్ వికాస్ పత్ర సౌకర్యాన్ని దేశంలోని 1.5 లక్షలకు పైగా పోస్టాఫీసుల్లో పొందవచ్చు..కిసాన్ వికాస్ పత్రలో 6.9% చొప్పున వడ్డీని పొందవచ్చు. పథకంలో జమ చేసిన మీ డబ్బు కేవలం 124 నెలల్లో రెట్టింపు అవుతుంది.

 

 

 

124 నెలలు అంటే 10 సంవత్సరాల 4 నెలలు అంటే మీ అసలు మొత్తం రెట్టింపు అవుతుంది. మీరు కిసాన్ వికాస్ పత్రలో కనీసం రూ. 1000 పెట్టుబడి పెట్టాలి. ఇది కాకుండా ఇందులో గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు. మీరు కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికేట్ 1000, 5000, 10000, 50000 రూపంలో కొనుగోలు చేయవచ్చు.ఇందులో మీరు మెచ్యూరిటీకి ముందు నిర్దిష్ట పరిస్థితుల్లో డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. మెచ్యూరిటీ తర్వాత, మీరు మీ డబ్బును సమీపంలోని ఏదైనా పోస్టాఫీసు నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు..ఇందులో బెనిఫిట్ ఏంటంటే..మీకు ఎప్పుడైనా డబ్బు అవసరమైతే మీరు మీ డబ్బును రెండున్నరేళ్ల తర్వాత కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. దానిపై మీకు 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. కిసాన్ వికాస్ పత్రలో మీ పెట్టుబడికి మంచి భద్రత ఉంటుంది..పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.. పెట్టుబడి పెట్టాలని అనుకోనేవారికి ఇది బెస్ట్ అనే చెప్పాలి.

 

Tags: Double money in 124 months

Leave A Reply

Your email address will not be published.