డాక్టర్., అబ్దుల్ కలామ్ జయంతి
మానవీయతకు మరో రూపం “కలామ్”
అమరావతి ముచ్చట్లు:
“భరతఖండం గర్వించదగ్గ మహోన్నత మూర్తిమత్వంజీవితాంతం నిత్యాన్వేషీగా నిలిచిన జ్ఞానజ్యోతిదేశంలోని యువతకు నిరంతర స్ఫూర్తి ప్రదాతకలలను సాకారం చేసుకున్నట్టి కర్మయోగిఆచంచలమైన ఆత్మస్థైర్యం నిండిన అభయంకరుడుమానవత్వానికి కలామ్ని లువెత్తునిదర్శనంకర్మమార్గమేధర్మమార్గంఅన్నసత్యాన్వేషినిర్మలత్వం,నిస్వార్థం,నిరాడంబరంలనే త్రిగుణములను ఆచరించి చూపిన మార్గదర్శిదేశ సంస్కృతిని, ఐక్యతను వినిమయం చేసిన సమున్నత తేజంమన అబ్దుల్ కలాం”అబ్దుల్ కలాం గారిని గురించి బాగా తెలిసిన వారికి మాత్రం బహుముఖ ప్రజ్ఞావంతుడు. నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ నికార్సైన వ్యక్తిత్వము , నిరంతరశ్రమ, సాధించాలనే తపనతో ముందుకు సాగారు. వారి కాలంలో మరెవరితోనూ పోల్చలేనంతగా సృజనాత్మకత కలిగిన శాస్త్రవేత్త అన్నింటికీ మించిన గొప్ప అధ్యాపకుడు గానే కాదు మంచి వక్త కూడా, దేశానికి మార్గదర్శి, సంగీత విద్వాంసుడు, మహా మేధావిగా భారతీయ ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలిచిన “డాక్టర్ అబ్దుల్ కలాం” మనకు దర్శనమిస్తారు.

Tags: Dr., Abdul Kalam Jayanti
