దేశానికి దశా దిశా నిర్దేశకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

Dr BR Ambedkar is the direction director of the country

Dr BR Ambedkar is the direction director of the country

వైసిపి జిల్లా కార్యదర్శి శీలం భాస్కర

Date:06/12/2019

సోమల ముచ్చట్లు:

భారత దేశానికి దశ దిశా నిర్దేశకుడు డాక్టర్ అంబేద్కర్ అని వైసీపీ జిల్లా కార్యదర్శి శీలం భాస్కర అన్నారు మండల కేంద్రమైన సోమల బస్టాండ్ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 63వ వర్ధంతి సందర్భంగా వైయస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు అలంకరించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు వైసిపి నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని తనదైన శైలిలో రాయడం వల్ల బడుగు బలహీన వర్గాలకు చేయూతనిచ్చి ముందుకు సాగడం జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా పని చేస్తున్నారని తెలిపారు సమాజంలో ఉన్న అన్ని సెక్టార్ లను కలుపుకొని పని చేస్తున్నారన్నారు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టు వంటి అభివృద్ధి పథకాలను జగన్మోహమోహన్ రెడ్డి అంబేద్కర్ ఆలోచనా విధానంలో చేస్తున్నారన్నారు ఒకేసారి అనేక చట్టాలు ప్రజలకు ఉపయోగపడే అంశంగా ప్రవేశపెట్టారన్నారు ఎలా ఉండకూడదు అన్నది గత ప్రభుత్వం ఎలా ఉండాలి అన్నది ప్రస్తుత ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు డాక్టర్ వెంకటేశ్వరరావు సరస్వతమ్మ మధుసూదన్ నాయుడు తాత మల్లయ్య అధిక సంఖ్యలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

 

పాపం పండిందంటూ…భగవద్గీత ప్రస్తావన

 

Tags:Dr BR Ambedkar is the direction director of the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *