డా. పూనూరు గౌతమ్ రెడ్డికి ఘన సన్మానం
తిరుపతి ముచ్చట్లు :
వై ఎస్ ఆర్ టి యు సీ రాష్ట్ర అధ్యక్షులుగా ఏడవ సారి ఎన్నికైన డా. పూనూరు గౌతమ్ రెడ్డిని వై ఎస్ ఆర్ టి యు సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ రాజా రెడ్డి అధ్వర్యంలో గురువారం ఉదయం విజయవాడలోని ఏపి పైబర్ నెట్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎన్. రాజా రెడ్డి మాట్లాడుతూ డా. పూనూరు గౌతమ్ రెడ్డి ఏడవ సారి వై ఎస్ ఆర్ టి యు సీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నిక కావడం చాలా సంతోషించ దగ్గ విషయమని అన్నారు. పార్టీ అధికారం లోనికి రాక మునుపే కార్మికులను ఐక్య పరచి వారి సమస్యలపై అప్పటి ప్రభుత్వపై అనేక ఉద్యమాలు చేశారని,

వై ఎస్ ఆర్ పార్టీ అధికారం లోనికి వచ్చిన తర్వాత కూడా కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కరించడానికి కృషి చేశారని తెలిపారు. గౌతమ్ రెడ్డి నీ ఏడవ సారి వై ఎస్ ఆర్ టి యు సీ రాష్ట్ర అధ్యక్షులుగా చేసినా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి, అనుబంధ సంఘాల బాధ్యులైన విజయ సాయి రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వై యస్ ఆర్ టి యు సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటప్పరెడ్డి, నరహరిశెట్టి శ్రీహరి, ఎం. రాజేష్ కుమార్ ( నెల్లూరు), నారాయణ రెడ్డి, సురేష్ ( సత్యవేడు), కే వీ కిరణ్ కుమార్ ( మెడికల్ & హెల్త్) తదితరులు పాల్గొన్నారు.
Tags: Dr. Great honor for Poonur Gautham Reddy
