Natyam ad

ఐఎంఏ నంద్యాల మహిళా విభాగం అధ్యక్ష కార్యదర్శులుగా డాక్టర్ కల్పన, డాక్టర్ సరిత

నంద్యాల ముచ్చట్లు:

ఐఎంఏ నంద్యాల శాఖ మహిళా విభాగం సర్వసభ్య సమావేశంలో రానున్న రెండు సంవత్సరాలకు మహిళా విభాగం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఐఎంఏ నంద్యాల శాఖ మహిళా విభాగం అధ్యక్షురాలుగా డాక్టర్ కల్పన, గౌరవ అధ్యక్షురాలుగా డాక్టర్ నర్మదా, కార్యదర్శిగా డాక్టర్ సరిత, కోశాధికారిగా డాక్టర్ లలిత, ఉపాధ్యక్షులుగా డాక్టర్ ధనలక్ష్మి ,డాక్టర్ శశికిరణ్ సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ నేట్ల శిల్పా, డాక్టర్ ప్రియదర్శిని, కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ షబ్నం , డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ హర్షిని, డాక్టర్ సాయి హరీష ,డాక్టర్ కీర్తి రెడ్డి, డాక్టర్ సునీత, డాక్టర్ కృష్ణవేణి, డాక్టర్ క్రాంతి ,డాక్టర్ కావ్య, డాక్టర్ జి అనుష ఎంపికయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ కల్పన, డాక్టర్ సరిత మాట్లాడుతూ నంద్యాల మహిళా వైద్య విభాగం ద్వారా విస్తృత సేవా కార్యక్రమాలు, వైద్య ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహించబోతున్నామని తెలిపారు.
నూతన కార్యవర్గాన్ని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అభినందించారు. డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నంద్యాల మహిళా వైద్య విభాగం తమ సేవల ద్వారా రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందారని , అదే మార్గంలో సేవా కార్యక్రమాల ద్వారా వైద్యులు ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు.

 

Tags; Dr. Kalpana and Dr. Sarita are the President Secretaries of IMA Nandyala Women’s Section

Post Midle
Post Midle