అమ్మవారి సేవలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి
తిరుపతి ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి కుటుంబ సభ్యులతో శనివారం సాయంత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆలయంలో ధ్వజసంభానికి మొక్కుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం డిప్యూటీ ఈవో తీర్థప్రసాదాలు అందించారు. తరువాత డాక్టర్ కె. ఎస్ జవహర్ రెడ్డి శ్రీ పద్మావతి అమ్మవారి చంద్రప్రభ వాహన సేవలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈవో ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Tags; Dr. KS Jawahar Reddy is the Chief Secretary of the State Government in Ammavari Seva

