గ్రామ సచివాలయం ప్రారంభించిన డాక్టర్ మద్దిశెట్టి

దర్శి ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం లోని కురిచేడు మండలం బోధనoపాడు గ్రామం లో గురువారం దర్శి శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ గ్రామ సచివాలయం ప్రారంభించారు. ఈ సందర్బంగా గ్రామ ప్రజలు వైసీపీ అభిమానులు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మరియు మద్దిశెట్టి శ్రీధర్ కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రం లో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలు పధకాలు ప్రవేశ పెట్టి ప్రజలు హృదయాలలో శిరస్థాయిగా నిలిచారాని గొప్పగా కొనియాడారు. గ్రామ సచివాలయాలు పెట్టి ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువై అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా వేణుగోపాల్ మరియు శ్రీధర్ కు శాలువాలు కప్పి పూలమాలలు తో ఘనంగా సత్కరించారు. తదుపరి దర్శి మండలం తుమ్మెదలపాడు లో చెరువు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో కురిచేడు మండలం వైసీపీ నాయకులు, భోధన0పాడు గ్రామ సర్పంచ్, మరియు ఉపసర్పంచ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Dr. Maddishetti, who started the village secretariat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *