మలేసియా తెలుగు విశిష్ట సేవా పురస్కారం అందుకున్న డాక్టర్ పైడి అంకయ్య:
చౌడేపల్లి ముచ్చట్లు:
మలేసియా దేశంలో తెలుగు సంఘం , క్లాoగ్ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా.వివిధ రంగాల్లో ప్రావీణ్యం కలిగిన తెలుగు వారిని గుర్తించి వారికి అంతర్జాతీయ పురస్కారంను అందచేసారు. ఈ నెల జనవరి 28 వ తేదీన మలేసియా క్లాoగ్ లోని మజీలీస్ ప్రబండరం లైబ్రరీలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి నుంచి వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా.పైడి అంకయ్య సామాజిక సేవ సమాజ శ్రేయస్సు కాంక్షించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వేలాదిమంది కళాకారులను ప్రోత్సహిస్తూ సామాజిక సేవలో అందరికీ ఆదర్శంగా నిలిచిన డా.పైడి అంకయ్య తన బృందంతో . మలేసియా దేశంలోని తెలుగు సంఘము ఆధ్వర్యంలో క్లాంగ్ శాఖ నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో అద్భుత ప్రదర్శనని ఇచ్చారు.
రాయలసీమ మిమిక్రీ & మ్యాజిక్ అకాడమీ గౌరవ అధ్యక్షులు డా. డి. విజయ కుమార్ ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది. పార్లమెంటు సభ్యులు గనబతిరావు చేతులమీదుగా మలేసియా విశిష్ట సేవా పురస్కారాన్ని అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ పైడి అంకయ్య మాట్లాడుతూ నన్ను ఆహ్వానించిన మలేసియా దేశంలోని తెలుగు సంఘం చైర్మన్ సుబ్రమణ్యం,రామా, పవన్ కి మరియు నాకు పురస్కారం రావడానికి, నేను సమాజంలో సేవ చెయ్యడానికి నాకు అనునిత్యం సహాయ సహకారాలు అందిస్తూన్న తల్లిదండ్రులకు ,నా కుటుంబసభ్యులకు మరియు వే ఫౌండేషన్ టీం సభ్యులకు , దాతలకు ,నా స్నేహితులకు ,నా తోటి సమాజ సేవకులకు, మరియు పత్రికా విలేకర్లకు ,ఎలక్ట్రానిక్ మీడియా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసారు.

Tags: Dr Paidi Ankaiah who received the Malaysia Telugu Distinguished Service Award:
