సోషల్ జస్టిస్ రైట్ ఫర్ ఆర్గనైజేషన్ చిత్తూరు జిల్లా గౌరవ చైర్మన్ గా డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి

Date:06/08/2020

Dr. Rallapally Sudharani has been appointed as the Honorary Chairman of Chittoor District, Social Justice Right for Organization

తిరుపతి ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా సోషల్ జస్టిస్ రైట్ ఫర్ ఆర్గనైజేషన్ గౌరవ చైర్మన్ గా డాక్టర్ రాళ్ళపల్లి సుధారాణి ని నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కా సాయిబాబు  గురువారం ఉత్తర్వులు జారీచేశారు. డాక్టర్ సుధారాణి  అనేక సంఘ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సీనియర్ డాక్టర్ గా అవినీతి రహిత సమాజ నిర్మాణంలో భాగస్వామి అయి, పేద ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం, వారి క్రమశిక్షణ, పట్టుదల, సేవా తత్పరత, అభ్యున్నతి గుర్తించి చిత్తూరు జిల్లా గౌరవ చైర్మన్ బాధ్యతలు అప్పగించడం జరిగిందని, చిత్తూరు జిల్లాలో ఆర్గనైజేషన్ కమిటీని నడిచేందుకు సామాన్యులకు అండగా కృషి చేయాలని సాయిబాబు  ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ కార్మికుల సమస్యలు, రైతుల సమస్యలు, విద్యార్థులలో పూర్తి అవగాహన, కమ్యూనికేషన్ తదితర సామాజిక సమస్యల పరిష్కారం కోసం, ప్రజలకు అండగా ఉంటూ, ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకొచ్చి పరిష్కరించేందుకు సుధారాణి గారు కృషిచేయాలని పేర్కొన్నారు. సుధారాణి నియామక ఉత్తర్వులను చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా కి, చిత్తూరు జిల్లా ఎస్పీ కి, చిత్తూరుజిల్లా జడ్జి కి అందజేస్తున్నట్లు జక్కా సాయిబాబు గారు తెలిపారు.

 

ఈ సందర్భంగా సోషల్ జస్టిస్ రైట్ ఫర్ ఆర్గనైజేషన్ చిత్తూరు జిల్లా గౌరవ చైర్మన్ గా తనపై నమ్మకం ఉంచి నియమించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి బాబు కి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి సుబ్రహ్మణ్యంకి, ఆర్గనైజేషన్ లోని సహచరులకు సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి కోలా లక్ష్మీపతి కి ,సుధారాణి  కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, కరోనా వ్యాధి నివారణపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, ప్రజలకు అవగాహన శిబిరాలు నిర్వహిస్తూ, సోషల్ జస్టిస్ సోషల్ ఫర్ ఆర్గనైజేషన్ కార్యక్రమాలను జిల్లాలో విస్తృతంగా నిర్వహిస్తామని డాక్టర్ సుధారాణి తెలియజేశారు.

తిరుపతి పద్మావతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్ లో తనిఖీ

Tags: Dr. Rallapally Sudharani has been appointed as the Honorary Chairman of Chittoor District, Social Justice Right for Organization

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *