జిల్లా అధ్యాపకుల సంఘ సలహాదారుగా డాక్టర్ రెడ్డెప్ప
పుంగనూరు ముచ్చట్లు:
జిల్లా ప్రభుత్వ అద్యాపకుల సంఘ సలహదారుగా పట్టణానికి చెందిన అద్యాపకుడు ఎం.రెడ్డెప్పను ఎన్నుకున్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ బసవరాజ కళాశాలలో సలహదారుగా ఎంపికైన రెడ్డెప్పను సహచర అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రెడ్డెప్ప మాట్లాడుతూ ప్రభుత్వ లెక్చరర్ల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. సంఘాన్ని పటిష్టం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దయానందరాజు, అధ్యాపకులు మోహనచారి, వెంకటరెడ్డి, విశ్వనాథ్, మోహనాచారి, మైనుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.

tags: Dr. Reddeppa as District faculty community adviser
