డాక్టర్‌ శివకు అబ్ధుల్‌కలామ్‌ అవార్డు

Dr. Shiva receives Abdulkalam Award

Dr. Shiva receives Abdulkalam Award

Date:22/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

సుమారు ముప్పె సంవత్సరాలుగా ప్రజలకు వివిధ రకాల సేవలు అందిస్తున్న  లయన్స్ క్లబ్  జిల్లా పీఆర్‌వో , సరళనర్శింగ్‌హ్గమ్‌ అధినేత డాక్టర్‌ పి.శివకు మాజీ రాష్ట్రపతి ఏపిజె అబ్ధుల్‌కలామ్‌ అవార్డును అందజేయనున్నారు. మంగళవారం తిరుపతికి చెందిన ప్రజానేస్తం సంస్థ అధ్యక్షుడు రాజారెడ్డి తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో ప్రతియేటా తెలుగు రాష్ణ  లలో విశిష్ఠ సేవలు అందించిన వారికి అవార్డులతో సన్మానిస్తారు. ఈసారి పట్టణనికి చెందిన డాక్టర్‌ శివతో పాటు మరో నలుగురికి అబ్ధుల్‌కలామ్‌ ఎక్స్లెన్షి అవార్డును అందిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు సమాచారం అందించారు. ఈ కార్యక్రమం ఈనెల 24న తిరుపతి మహాతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలు కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి బాస్కర్‌రెడ్డి లు హాజరుకానున్నారు. గ్రహితలకు వీరి చేతులు మీదుగా సన్మానం నిర్వహించి, అవార్డులు ప్రధానం చేయిస్తామని రాజారెడ్డి తెలిపారు.

మీసేవ కేంద్రాలలో బోర్డులు ఏర్పాటు చేయాలి

Tags: Dr. Shiva receives Abdulkalam Award

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *