Natyam ad

తండ్రి బాటలో డాక్టర్ సొహైల్

– డా.సోహైల్ జన్మదినం సందర్భంగా పలుసేవా కార్యక్రమాలు
– డిప్యూటీ సీఎం అంజాద్ బాషా

కడప ముచ్చట్లు:

దివంగత మంత్రి డా.ఎస్. ఏ.ఖలీల్ భాష తనయుడు డాక్టర్ సోహైల్ అహమ్మద్ జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రజాసేవకు నిదర్శనమని, తండ్రి బాటను డాక్టర్ సోహైల్ ఎంచుకొని సేవలు చేయడం ఎంతో శుభ పరిణామమని డిప్యూటీ సీఎం, మైనారిటీ శాఖ మంత్రి ఎస్ బి అంజాద్ భాష తెలిపారు. శనివారం వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్ సోహైల్ అహమ్మద్ జన్మదినం సందర్భంగా ఆయన యువసేన అధ్యక్షులు అవినాష్ రెడీ ఆధ్వర్యంలో ఖలీల్ నర్సింగ్ హోమ్ లో రక్తదాన శిబిరం, అన్నదానం,కేక్ కటింగ్ తదితర పలు సేవా కార్యక్రమాలతో పాటు యువతతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఉపముఖ్యమంత్రి ఎస్ బి అంజద్ భాషా ముఖ్యతిదిగా హాజరై కార్యక్రమాలను ప్రారంభించి, మాట్లాడుతూ డాక్టర్ సోహైల్ తండ్రి ఖలీల్ భాషా వైద్యశాల ఏర్పాటు చేసి వైద్య సేవలో, మంత్రిగా ప్రజలకు అందుబాటులో ఉండి మంచి పేరు ప్రతిష్టలు గడించారని తెలిపారు .

 

 

Post Midle

తండ్రి బాటలోనే తనయుడు సోహైల్ డాక్టర్ గా ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలతో ప్రజాదరణ పొందుతూ తండ్రి స్ఫూర్తితో ప్రజా సేవలో ముందుకు సాగడం హర్షణీయం అన్నారు. రాబోయే రోజుల్లో డా. సోహెల్ మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు.అనంతరం డాక్టర్ సొహై ల్ అహ్మద్ మాట్లాడుతూ మా తండ్రి ఆశయ సాధన కోసం ప్రజలకు అందుబాటులో వుంటు వారికి సేవలందించడమే దెయ్యం గా ముందుకు సాగుతానని తెలిపారు.తదుపరి పలువురు నేతలు,అభిమానులు ఆయనను శాలువా,బుకెలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో వైసిపి మహిళా నాయకురాలులు తులసమ్మ, రామలక్ష్మమ్మ, సావిత్రమ్మ, రమణమ్మ,వైసిపి నేతలు,కార్యకర్తలు, యువసేన జేబీ అర్షద్ అలీ, కాజా, మునీర్, సాదక్, ప్రదీప్,కూన్ కా రిష్టా అధ్యక్షుడు తారీక్ అలి, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Dr. Sohail in his father’s footsteps

Post Midle