డాక్టర్ సుధాకర్ పై  సాధింపు చర్యలు మానుకోవాలి

-మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్

Date:30/05/2020

నెల్లూరు  ముచ్చట్లు:

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు  నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్  అబ్దుల్ అజీజ్ గారు ఆదేశాల మేరకు  దళిత డాక్టర్ సుధాకర్ ప్రభుత్వాన్ని మస్కూలు అడిగిన పాపానికి వైకాపా ప్రభుత్వం ఆయన పట్ల చేస్తున్న కక్షసాధింపు చర్యలను నిరసిస్తూ వి‌ఆర్‌సి సెంటర్ వద్ద నెల్లూరు రూరల్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ దళితుల పై కక్ష్యసాధింపు చర్యలను ప్రభుత్వం విరమించు కోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వాన్ని ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ ని నడి రోడ్డు మీద కొట్టి ,పిచ్చోడు అని ముద్రా వెయ్యడం  దారుణమైన చర్య, దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి డాక్టర్ సుధాకర్ కు మెరుగైన వైధ్యం నినాదాలు చేశారు.డాక్టర్ సుధాకర్  చెప్పిన విధంగా ఒకవేళ సుధాకర్ గారికి ఏమైనా జరగరానిది జరిగితే ప్రభుత్వమే పూర్తి భాద్యత వేయించాలని ఆవేదన వ్యక్తపరిచారు.ప్రశ్నించిన వారిని వేధించే వైకాపా విష సంస్కృతిని మార్చుకోవాలని హెచ్చరించారు.ఒక డాక్టర్ ని పిచ్చోడిని చేసిన ఏకైక ప్రభుత్వం వైకాపా ప్రభుత్వ మాత్రమేనని వ్యాఖ్యానించారు.తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఈ కక్ష్యసాధింపు చర్యలు దీనిని మార్చుకోవాలి అని తెలిపారు .పై కార్యక్రమంలో టిడిపి నాయకులు జన్ని.రమణయ్య, మాతంగి.కృష్ణ ,కనపర్తి. గంగాధర్, భాస్కర్, కృష్ణయ్య, పల్లిపాటి.శ్రీనివాసులు ,గంధమ్.రమేష్, దిలీప్*, సురేష్ ,దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

రామ్ గోపాల్ వర్మ ఆవిష్కరించిన “వాళ్లిద్దరి మధ్య ” లిరికల్ వీడియో సాంగ్

Tags: Dr. Sudhakar should stop the achievement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *