ప్రతిభా వంతుడైన రచయిత డాక్టర్ వేదగిరి రాంబాబు

Dr. Vedagiri Rambabu is a talented writer

Dr. Vedagiri Rambabu is a talented writer

– కొనియాడిన కవులు రచయితలు
Date:15/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ప్రతిభా వంతుడైన రచయిత డాక్టర్ వేదగిరి రాంబాబు అని పలువురు వక్తలు కొనియాడారు.తెలుగునాట కథలను విస్తుతీకరించడం లో వేదగిరి రాంబాబు కీలక పాత్ర పోషించారని అన్నారు. తెలుగు బాషా సాంస్కృతిక శాఖ, సింహ ప్రసాద్ సాహిత్య సమితి సంయుక్త ఆద్వర్యం లో రవీంద్ర భారతి లో వేదగిరి రాంబాబు బాల సాహిత్య యువ పురస్కార ప్రదానోత్సవం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అది కర బాషా సంఘం అద్యక్షులు దేవులపల్లి ప్రబాకర్ రావు హాజరై ప్రసంగించారు.తెలుగు సాహిత్యం లో వేల ఎల్లా క్రితమే కథ ప్రక్రియ ప్రారంబమైదని తెలిపారు.తెలుగు కథల్లో పరిశోధనలకు రాంబాబు విస్తృతంగా కృషి చేసారన్నారు.
కథ ఫైఆయన చేసిన ప్రయోగాలు అజరమమైనవని కొనియాడారు.దక్కన్ అండ్ బాల చెలిమి సంపాదకులు  వీడ కుమార్ మాట్లాడుతూ సాహిత్య సమాజం ఫై వేదగిరికి మంచి పట్టు ఉందని,కతా పక్రియలో ఎన్నో భాద్యతలు నిర్వహించారన్నారు. అనంతరంవేదగిరి రాంబాబు బాల సాహిత్య యువ పురస్కారాన్ని డాక్టర్ పట్టి పాటి మోహన్ కు అందజేశారు.
ఈ సందర్బంగా తెలుగు బాషా సాంస్కృతిక శాఖ,మహిళా సాహిత్య సాంస్కృతిక సమాఖ్య ,సాదన సాహితీ స్రవంతి ల సంయుక్త ఆద్వర్యం లో రూపొందించిన వేదగిరి రాంబాబు నివాళి ప్రత్యెక సంచిక స్పూర్తి పథం పుస్తకాన్ని తెలుగు బాషా సాంస్కృతిక శాఖ, సంచాలకులు మామిడి హరికృష్ణ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం లో ప్రముఖ రచయిత సుదామా,సంజిశెట్టి శ్రీనివాస్,పిల్లల మర్రి రాములు,రావుల పాటి సీతారాం రావు,వీరాజి,కే.బి.లక్ష్మి,విహారి తదితరులు పాల్గొన్నారు.
Tags:Dr. Vedagiri Rambabu is a talented writer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *