నామినేషన్ వేసిన ద్రౌపదీ ముర్మూ.. వెంటే ఉన్న ప్రధాని, కేంద్ర మంత్రులు..

దిల్లీ ముచ్చట్లు:

రాష్ట్రపతి ఎన్నిక లో ఎన్డీయే అభ్యర్థి గా పోటీ చేస్తున్న ద్రౌపదీ ముర్మూ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.ఈ రోజు ఉదయం దిల్లీ లోని ఒడిశా భవన్‌ నుంచి పార్లమెంట్‌ కు చేరుకున్న ఆమె.. తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఆమె వెంటే వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ వాటిని రిటర్నింగ్ అధికారికి అందజేశారు.దానికి ముందు ఆమె పార్లమెంట్ ప్రాంగణం లోని మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌, బిర్సా ముండా విగ్రహాల వద్ద నివాళులు అర్పించారు.రాష్ట్రపతి అభ్యర్థి గా ముర్మూ పేరును మొదట ప్రధాని మోదీ ప్రతిపాదించగా.. ఆమె పేరును ప్రతిపాదిస్తూ 50 మంది ఎలక్టోరల్ కాలేజ్‌ సభ్యులు సంతకాలు చేశారు.ఎన్డీఏ ఎంపీ లు, భాజపా రాష్ట్రాల సీఎం లు, మరో 50 మంది ఎంపీ లు ఆమెను బల పరిచారు.వీరిలో వైకాపా తరఫున ఎంపీలు, విజయ్‌ సాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి కూడా ఉన్నారు.ముర్మూ అభ్యర్థిత్వం కోసం భాజపా (BJP) నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను సిద్ధం చేసింది.ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజనాథ్‌ సింగ్, అమిత్‌ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా వాటిపై సంతకాలు పెట్టారు.ఇక నామినేషన్ సమయంలో వీరితో పాటు భాజపా, ఎన్డీయే రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Draupadi Murmu nominated .. Prime Minister and Union Ministers behind ..

Post Midle
Natyam ad