Natyam ad

కలలు కనండి.. ఆ కలలను సాకారం చేసుకోండి-మంత్రి ఆర్కే రోజా

నేటి విద్యార్థులే దేశ సంపద

అబ్దుల్ కలాం నాకు స్ఫూర్తి

అబ్దుల్ అబ్దుల్ కలాం జీవితం యువతకు ఆదర్శం

Post Midle

– తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి

 

తిరుపతి ముచ్చట్లు:

కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి.. అన్న అబ్దుల్ కలాం నినాదాన్ని విద్యార్థులు పుణికి పుచ్చుకొని తమ భవిష్యత్తును దిద్దుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు . స్వర్గీయ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 91వ జయంతిని పురస్కరించుకొని అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డుల ప్రధానోత్సవం ఉత్తమ విద్యార్థుల అభినందన సభను గురువారం తిరుపతి మహతి ఆడిటోరియంలో సంకల్ప సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్ రాజారెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు . ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి రోజా మాట్లాడుతూ మనిషి మహోన్నతుడు కావడానికి చదువు ఒకటే మార్గం అన్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అబ్దుల్ కలాం సైంటిస్ట్ గా ,రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన తీరు, ఆయన నడవడిక నేటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకం అన్నారు. పేదరికం చదువుకు, ప్రతిభకు అడ్డంకి కాదని నిరూపించిన గొప్ప వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం అన్నారు .ఆయన స్ఫూర్తితోనే తాను కూడా భాకరాపేట లోని చిన్న కుగ్రామం నుంచి మంత్రి స్థాయికి ఎదిగానని తెలిపారు. కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అన్న అబ్దుల్ కలాం నినాదాన్ని తాను స్ఫూర్తిగా తీసుకొని ఎదిగానని తెలిపారు. తాను తిరుపతిలోనే సైకిల్ పై వెళ్లి చదువుకున్నానని ఇదే ప్రాంతంలో మంత్రిగా కాన్వాయ్ లో రావడం వెనుక మీ అందరి ప్రేమాభిమానాలు ఉన్నాయని తెలిపారు .శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిసవుతుందని, విద్యార్థులు అంకుటితో దీక్షతో అనుకున్న లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు .రాష్ట్రపతి స్థాయికి ఎదిగినప్పటికీ విద్యార్థులు, యువతను దేశ సంపదగా, ఆస్తిగా భావించి తన చివరి రక్తపు బొట్టు వరకు అబ్దుల్ కలాం ప్రోత్సహించారని తెలిపారు.

 

 

 

 

ఎప్పుడు వచ్చావు అన్నది ముఖ్యం కాదని బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ప్రధానమని చెప్పారు. ఉన్నత లక్ష్యాలు ఎంచుకొని పుట్టిన నేలకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రతిష్టలను తీసుకువచ్చే విధంగా ఎదగాలని కోరారు. అబ్దుల్ కలాం ఆశయాలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ఒక మేనమామగా విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు . గౌరవ అతిథి తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ సంకల్ప సేవా సమితి అధ్యక్షుడు రాజారెడ్డి విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు నడుపుతూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించారని తెలిపారు. నేడు కూడా విద్యార్థుల అభివృద్ధికి అబ్దుల్ కలాం ఆశయాలను ముందుకు సాగుతూ ఉండడం అభినందనీయమని తెలిపారు. అబ్దుల్ కలాం జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఆయన సూచించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషికి విద్యార్థులు అండగా నిలవాలని కోరారు. ఏపీ ఎస్ ఎఫ్ ఎల్ కార్పొరేషన్ చైర్మన్ డా.పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ చిన్న పూరి గుడిసెలో జీవించిన ఏపీజే అబ్దుల్ కలాం దేశం గర్వించదగ్గ పౌరుడిగా ఎదిగి రాష్ట్రపతి స్థానాన్ని అధిరోహించారని తెలిపారు.

 

 

 

 

అబ్దుల్ కలాం ఇంటి పక్కనే ఉన్న బంగారు దుకాణ యజమాని కుమారుడు పేదరికంలోకి వెళ్లవలసిన పరిస్థితి వచ్చిందన్నారు ఎవరు దొంగిలించలేని ఆస్తి చదువు అని కోట్లు కూడబెట్టిన అవి దొంగల పాలు అవుతాయని పిట్ట కథ చెప్పి విద్యార్థులను ప్రోత్సహించారు. సభాధ్యక్షులు ఎన్ రాజారెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారి కేఎల్ వర్మ, విశ్వం స్కూల్ అధినేత, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాయలసీమ అధ్యక్షుడు ఎన్ విశ్వనాథరెడ్డి, ఆ సంస్థ రాష్ట్ర లీగల్ అడ్వైజర్ కె ఎస్ వాసు, రాయలసీమ విద్యా సంస్థల అధినేత వై. ఆనందరెడ్డి, సేవ్ నర్సింగ్ కళాశాల అధినేత డా.వై ప్రవీణ్ తదితరులు ప్రసంగించారు. విద్యార్థులు చిన్నతనం నుంచే ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగితే అనుకున్నది సాధించగలరని తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి ఈనెల 29న తిరుపతిలో చేపట్టిన ఆత్మగౌరవ మహా ప్రదర్శనలో విజయవంతం చేయడంలో విద్యార్థులు కీలక భూమిక పోషించాలని కోరారు.

అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డు గ్రహీతలు వీరే

రక్తదానం ప్రాణదానం తో సమానమని చాటుతో ఉద్యమాన్ని నడిపిన మానవతా సంస్థ కన్వీనర్ తరిమెల అమర్నాథ్ రెడ్డి రెడ్డి( అనంతపురం), ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ అధ్యక్షుడు డాక్టర్ ఎం ఆర్ ఎన్ వర్మ (విశాఖ )’

సాహస యాత్రల ద్వారా ప్రకృతి ప్రేమికులుగా సేవలు అందిస్తున్న చరిత్రకారులు బివి రమణ, బి.బాలసుబ్రహ్మణ్యం సోదరుల తో పాటు స్కేటింగ్ చిచ్చర పిడుగు జాతీయ గోల్డ్ మెడల్ గ్రహీత చిరంజీవి సి మెహిన్ వర్మలను అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డులను ప్రధానం చేసి సత్కరించారు. మంత్రి రోజా ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి చేతుల మీదుగా అవార్డు గ్రహీతలను, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విచ్చేసిన ప్రభుత్వ ,ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల విద్యార్థుల సాంస్కృతిక కళా ప్రదర్శనలు, ప్రముఖ మిమిక్రీ ఇంద్రజాల కళాకారుడు డాక్టర్ డి విజయ్ కుమార్ ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా కట్టుకున్నాయి. శంకరంబాడి సాహిత్య పీఠం అధ్యక్షురాలు డాక్టర్ డి మస్తానమ్మ అనుసంధాన కర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ప్రైవేటు విద్యాసంస్థల అసోసియేషన్ నాయకులు ఓ వెంకటరమణారెడ్డి, రవీంద్రారెడ్డి ఎల్ రమేష్ నాయుడు సుబ్రహ్మణ్యం రాజు, జనార్దన్ రెడ్డి, ట్రేడ్ యూనియన్ నాయకులు మురళి రెడ్డి, రాజేష్ ,చిన్న జయన్న ,చిన్నమ్మ, సంకల్ప సేవా సమితి నాయకులు ఎన్ ఎస్ శివారెడ్డి, బాలసుబ్రమణ్యం, అడ్వకేట్ యోగానంద ,డాక్టర్ స్వరాజ్ లక్ష్మి, రఫీ, కిరణ్ కుమార్ రెడ్డి రఫీ హిందుస్తానీ, యశోద, రత్నం, పెదరాయుడు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Dream.. make those dreams come true- Minister RK Roja

Post Midle