తాగునీటి సమస్య లేకుండ చేస్తాం

Drinking water does not cause the problem

Drinking water does not cause the problem

– కొండవీటి నాగభూషణం

Date:08/12/2019

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలో తాగునీటి సమస్య లేకుండ చేసేందుకు మంచినీటి బోర్లు వేస్తున్నట్లు వైఎస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం తెలిపారు. ఆదివారం పట్టణంలో బోర్లు వేసే కార్యక్రమాన్ని ఆయన మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌ , మాజీ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, మాజీ కౌన్సిలర్‌ అమ్ముతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో శాశ్వత మంచి నీటి సమస్యను చేపడుతున్నామన్నారు. త్వరలోనే సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకు నీటిని తరలించి, పట్టణంలో సరఫరా చేస్తామన్నారు. ఈ మేరకు మోటార్లను బిగించడం జరుగుతోందన్నారు. సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకును శుభ్రం చేయడం జరిగిందన్నారు. హంద్రీనీవా నీటిని తరలించి, ఫిల్టర్ల ద్వారా నీటిని శుభ్రం చేసి పంపిణీ చేస్తామన్నారు. త్వరలోనే మంచినీటి సమస్య తీరుతుందన్నారు. ప్రస్తుతం అవసరమైన ప్రాంతాలలో నీటి సరఫరా చేసేందుకు బోర్లు వేసే కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఉద్యోగులు జహీర్‌, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

 

విధే యతకు పట్టం

 

Tags:Drinking water does not cause the problem

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *