మూడేళ్లలోనే 7 కోట్ల కుటుంబాలకు తాగునీరు.

న్యూఢిల్లీ ముచ్చట్లు:


దేశంలో ఆగస్టు నాటికి 10 కోట్ల ఇళ్లను ట్యాప్ వాటర్ కనెక్షన్లతో అనుసంధించామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. స్వర్ణయుగానికి ఇంతకన్నా మంచి ప్రారంభం ఉండదని వ్యాఖ్యానించారు. ఇంటింటికి నీరు అందించాలనే ప్రభుత్వ లక్ష్యంలో ఇది పెద్ద విజయం అని ఆయన అన్నారు. జల్ జీవన్ మిషన్ కింద కేవలం మూడేళ్లలోనే 7 కోట్ల కుటుంబాలు మంచినీటి సదుపాయాన్ని పొందాయని అన్నారు.దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు 100 శాతం మంచినీటి సరఫరాను అందించిన రాష్ట్రంగా గోవా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రసంగించారు. పనాజీలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. భారతదేశం స్వాతంత్య్రం పొందిన ఏడు దశాబ్ధాల్లో 3 కోట్ల గ్రామీణ కుటుంబాలకు నల్లా నీటిని అందిస్తే.. కేవలం జల్ జీవన్ మిషన్ ద్వారా మా ప్రభుత్వం మూడేళ్లలోనే 7 కోట్ల గ్రామీణ కుటుంబాలకు నల్లా నీటిని అందించిందని ప్రధాని మోదీ అన్నారు.10 కోట్ల మైలురాయికి చేరడం.. నీటి సదుపాయాన్ని అందించడం కేంద్ర యెక్క నిబద్ధతకు నిదర్శనం అని.. మేము ఇంతమంది ప్రజలను కష్టాల్లో ఉంచలేమని ఆయన అన్నారు. ప్రజల భాగస్వామ్యం, రాజకీయ సంకల్పం, వనరులను సరైన రీతిలో వినియోగించుకోవడం వల్లే జల్ జీవన్ మిషన్ విజయవంతం అయిందని మోదీ అన్నారు.గోవాతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు డామన్ డయ్యూ, దాద్రానగర్ హావేలీని కూడా వంద శాతం నల్లానీరు అందుతోంది. జూలై 2024 నాటికి దేశంలో ప్రతీ గ్రామీణ కుటుంబానికి జల్ జీవన్ మిషన్ కింద తాగునీటిని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రాల్లో లక్ష గ్రామాలు ఓడిఎఫ్( బహిరంగ మలవిసర్జన రహిత) గ్రామాలుగా మారాయని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం ఓడిఎఫ్ ప్లస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఓడిఎఫ్ ప్లస్.. టాయిలెట్లు, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, గ్రే వాటర్ మేనేజ్మెంట్ మొదలైన పారిశుద్ధ్య లక్ష్యాలను గ్రామాలు చేరుకునేలా ప్రోత్స.

 

Tags: Drinking water for 7 crore families within three years.

Leave A Reply

Your email address will not be published.