పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి నిధులతో చిన్నతాండకు తాగునీరు -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

ఏన్నో ఏళ్లుగా నీటి సమస్య ఉన్న చిన్నతాండాకు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిధులతో తాగునీటి సౌకర్యం క ల్పించారు. ఆదివారం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి , ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి కలసి గ్రామంలో నీటి బోరు వేశారు. నీరు పడటంతో మోటారు బిగించి గ్రామస్తులకు నీటిని సరఫరా చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ చిన్నతాండాలో ఎన్ని బోర్లు వేసినా నీటి సమస్య తీరలేదని, ప్రస్తుతం మంత్రి ఆదేశాల మేరకు బోరు వేసి నీటి సమస్య పరిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీలు ఈశ్వరమ్మ, సరోజమ్మ, సర్పంచ్‌ గౌరమ్మ, భానుప్రకాష్‌ , గ్రామస్తులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Drinking water for children in Punganur with funds from Minister Peddireddy – MP Bhaskar Reddy

Post Midle
Natyam ad