Natyam ad

జగనన్న పడమటి ప్రాంతాలకు తాగునీరు- ఎంపీ మిధున్‌రెడ్డి

– మూడు రిజర్వాయర్లు
-ప్రతి చెరువుకు నీటిని నింపుతాం
-పుంగనూరు అభివృద్ధి పరుగులు

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామి మేరకు పడమటి నియోజకవర్గాలకు తాగునీరు – సాగునీరు అందించడం జరుగుతోందని , ఇందుకు గాను హంద్రీనీవా కాలువ సామార్థ్యాన్ని పెంపొందించి మూడు రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని, నేతిగుట్లపల్లె రిజర్వాయర్‌లో ఒక టిఎంసి నీటిని నిల్వ చేస్తామని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి తెలిపారు. శనివారం పుంగనూరు పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎంపీ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ నీటి సమస్య తీర్చేందుకు ఆవులపల్లె రిజర్వాయర్‌లో మూడు టీఎంసీ నీటి నిల్వలు ఉండేలా రిజర్వాయర్లు పనులు చురుగ్గా సాగుతోందన్నారు. అలాగే తంబళ్లపల్లె నియోజకవర్గంలో రిజర్వాయర్‌ నిర్మిస్తున్నామన్నారు . హెచ్‌ఎన్‌ఎస్‌ కాలువలు విస్తరణ పనులు చేసి పుంగనూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలకు తాగునీరు, సాగునీరు సమస్య లేకుండ చేయనున్నట్లు తెలిపారు. అలాగే వైఎస్సార్‌ జిల్లా గండికోట నుంచి పైపులైన్లు వేసి పడమటి నియోజకవర్గాలకు నీటి సమస్య లేకుండ చేసే భృహత్తర కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. రాబోవు 30 సంవత్సరాలలోకూడ మంచినీటి సమస్యరాకుండ ఉండేలా ఈ కార్యక్రమం రూపొందించామన్నారు. నియోజకవర్గంలో అన్నిరకాల అభివృద్ధి చేపట్టామన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు, విద్యుత్‌లైన్లు, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, ఆర్‌వోఆర్‌ప్లాంట్లు నిర్మించి ప్రజలకు రక్షిత మంచినీటిని అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, వైస్‌ చైర్మన్లు నాగేంద్ర, లలిత, వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము , వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌ తోపాటు కౌన్సిలర్లు , అధికారులు పాల్గొన్నారు.

అప్యాయంగా…

గడప గడపకు కార్యక్రమంలో ఎంపీ మిధున్‌రెడ్డి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి అప్యాయంగా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అక్కా పెన్షన్‌ వస్తోందా…అవ్వా జగనన్న నీ ఖాతాకు ఎన్ని లక్షలు వేశారు… అంటు సరదాగా మహిళలతో ఎంపీ సంభాషణ చేశారు. సంధ్య అనే నిరుద్యోగ యువతికి ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. మున్సిపల్‌ కార్మికుడి భార్య రేఖకు ఉద్యోగంతో పాటు రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించారు. అలాగే సీఎం రిలీప్‌ఫండ్‌ మంజూరు చేయాలని, పెన్షన్‌ ఇవ్వాలని కోరిన బాధితులతో అప్యాయంగా మాట్లాడి మంజూరు చేయిస్తామన్నారు.

సమయమనం పాటించండి…

పుంగనూరు నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి కొంత మంది ఓర్వలేక ఆరోపణలు చేయడం , రెచ్చగొట్టడం చేస్తున్నారని, ప్రతి ఒక్కరు సమయనం పాటించాలని ఎంపీ మిధున్‌రెడ్డి సూచించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధే అజెండాగా సాగుతోందన్నారు.

పరిశ్రమలు ఏర్పాటు…

మండలంలోని ఆరడిగుంటలో శ్రీకాళహస్తి పైపుల పరిశ్రమల వారు సంక్రాంతి తరువాత ఫెర్రాఆలయ్‌ పరిశ్రమ పనులను ప్రారంభిస్తారని ఎంపీ తెలిపారు. ఈ పరిశ్రమలో సుమారు 600 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇంకను పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వ పరంగా సౌకర్యాలు కల్పిస్తామని , పరిశ్రమల ఏర్పాటుకు ముందుకురావాలని కోరారు.

 

Tags: Drinking water for western areas of Jaganna – MP Midhun Reddy

Post Midle