Natyam ad

జగనన్న చలువతో పడమటి ప్రాంతాలకు తాగునీరు- ఎంపీ మిధున్‌రెడ్డి

– మూడు రిజర్వాయర్లు
– సీఎంతో ప్రారంభిస్తాం
– రెండువేల కోట్లతో పైపులైన్లు
-ప్రతి చెరువుకు నీటిని నింపుతాం
-పుంగనూరు అభివృద్ధి పరుగులు

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామి మేరకు పడమటి నియోజకవర్గాలకు తాగునీరు – సాగునీరు అందించడం జరుగుతోందని , ఇందుకు గాను హంద్రీనీవా కాలువ సామార్థ్యాన్ని పెంపొందించి మూడు రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని, నేతిగుట్లపల్లె రిజర్వాయర్‌ను ముఖ్యమంత్రి చేతులు మీదుగా ప్రారంభిస్తామన్నారు. అలాగే రెండువేల కోట్ల రూపాయలతో వైఎస్సార్‌ జిల్లా గండికోట నుంచి పైపులైన్లు వేసి పడమటి నియోజకవర్గాలకు నీటి సమస్య లేకుండ చేసే భృహత్తర కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పుంగనూరు అభివృద్ధిని ప్రతి ఒక్కరు అడ్డుకున్నారని అన్నారు. ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి ఇచ్చిన మాట మేరకు వేల కోట్ల రపాయలు విడుదల చేయడంతో ప్రతి గ్రామంలోను సిమెంటు రోడ్లు, కాలువలు, వీధులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే సచివాలయాలు, వెల్‌నెస్‌ సెంటర్లు, ఆర్‌బికెలు ఏర్పాటు చేశామన్నారు.

రెండువేల కోట్లతో పైపులైన్లు….

పడమటి నియోజకవర్గాలైన తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు ప్రాంతాలకు తాగునీరు కోసం రెండువేల కోట్లరూపాయలతో గండికోట రిజర్వాయర్‌ నుంచి పైపులైన్లు వేస్తామని ఎంపీ మిధున్‌రెడ్డి తెలిపారు. రాబోవు 30 సంవత్సరాల వరకు ఈ ప్రాంతాల వారికి మంచినీటి సమస్యలేకుండ ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.

చెరువులు నింపుతాం…

హంద్రీనీవా కాలువ సామార్థ్యాన్ని పెంచి, కృష్ణజలాలను తంబళ్లపల్లె పుంగనూరు నియోజకవర్గంలోని నేతిగుట్లపల్లె రిజర్వాయర్లకు తరలిస్తామన్నారు. అలాగే ఆవులపల్లె రిజర్వాయర్ల ద్వారా నీటిని రైతులకు అందిస్తామన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న చెరువులను అన్నింటికి నీటిని తరలిస్తామన్నారు. రైతులకు సమస్య లేకుండ తాగునీరు – సాగునీరు అందించే కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తామని ఎంపీ తెలిపారు.

పారిశ్రామికాభివృద్ధి….

నిరుద్యోగ సమస్యను పూర్తిగా నిర్మూలించేందుకు ఈ ప్రాంతంలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఎంపీ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పుంగనూరు అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరు పరిశ్రమలకు అనువైన స్థలంగా భావించి పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నారని ఎంపీ తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వ పరంగా అన్ని రకాల రాయితీలు కల్పించి, పారిశ్రామిక కేంద్రంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే పుంగనూరు నియోజకవర్గంలో వెటర్నరీ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామని ఇందుకు భూసేకరణ పూర్తికాబడిందని ఆయన తెలిపారు.

 

Tags: Drinking water for western regions with Jagananna Chaluva- MP Midhun Reddy

 

Post Midle

Leave A Reply

Your email address will not be published.