తాగునీటి సమస్య పరిష్కారం దిశగా..

Drinking water solution

Drinking water solution

 Date:10/10/2018
గుంటూరు ముచ్చట్లు:
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో తాగునీటి సమస్యలు ఉన్నాయి. డిమాండ్‌కు తగ్గట్లుగా నీటి సరఫరా లేదు. దీంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడంలేదు. మంచినీటి కోసం జనాలు సతమతమవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా రూ.520కిపైగా కోట్లతో తాగునీటి పథకాలను నిర్మించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా స్థానికంగా రెండు పూటలా మంచినీరు సరఫరా చేయాలని సర్కార్ భావిస్తోంది.
ప్లాన్ ప్రకారమే అన్నీ సాగితే మాచర్ల, గురజాల నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలకే కాక వినుకొండలోని పలు ఊళ్లకు తాగునీటిని సరఫరా చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. స్థానికుల్లో ఆశలు రేకెత్తించిన ఈ పథకాల నిర్మాణానికి బ్యాంక్‌ రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్ధిక వనరులు సమకూరిన వెంటనే నీటి ప్రాజెక్టుల నిర్మాణం మొదలుపెట్టేస్తామని అధికారులు అంటున్నారు.
పిడుగురాళ్ల కార్పోరేషన్‌తో పాటు పలు నియోజకవర్గాలను ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. దాదాపు 2.32 లక్షల మందికి బుగ్గవాగు జలాశయం ద్వారా మంచినీరు సరఫరా చేయనున్నారు. దీనికోసం జలాశయం దగ్గరే ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తారు. అక్కడ నుంచి గ్రామాల్లోకి పైప్‌లైన్స్ వేస్తారు. వీటిని ఇప్పటికే ఏర్పాటుచేసిన రక్షిత పథకాలకు అనుసంధానిస్తారు.  ఓవర్‌హెడ్‌ ట్యాంకులు సరిపోకపోతే మరికొన్నింటిని నిర్మిస్తారు. ఈ పథకానికి రూ.242 కోట్లు ఖర్చవుతుందని అధికాలు అంచనా వేశారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. మాచర్లతోపాటు పలు ప్రాంతాలకు నాగార్జునసాగర్‌ నుంచి నీటి సరఫరా చేయాలని భావిస్తున్నారు.
దీని కోసం సుమారు రూ.281 కోట్లు అవసరమవుతుంది. తాగునీటి సమస్యను శాస్వతంగా పరిష్కరించే దిశగానే అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. అందుకే నిధుల విషయంలో కూడా ఎక్కడా రాజీపడడంలేదు. పనులకు ఎంత ఖర్చవుతుందో కచ్చితంగా అంచనావేస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సంబంధిత అధికారులు చెప్తున్నారు. పల్నాడు ప్రాంతాన్ని వేధిస్తున్న నీటి కొరతకు చెక్ పెట్టాలని ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఈ క్రమంలో అధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనే అంతా భావిస్తున్నారు. నిధులు రాగానే త్వరిగతిన పనులు చేపట్టి తాగునీటిని సరఫరా చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది.
Tags:Drinking water solution

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *