వాహన పత్రాలతో వాహనాలను నడపండి
కడప ముచ్చట్లు:
కడప నగరములోని వాహనాలు నడిపే వారికి దగ్గర వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నట్లయితే ఎవరికి రోడ్డుపై భయపడాల్సిన పని ఉండదని, శాంతి సేవా సొసైటీ సభ్యులు అయ్యారి రమేష్ బాబు, (వ్యాపారవేత్త బెంగళూరు) మడగలం మనోహర్ అన్నారు. మడగలం దేవదాసు 35, వర్ధంతి సందర్భంగా మహావీర్ సర్కిల్లోని వాహనదారులకు పుష్పాలను అందించి వాహన పత్రాలు తప్పనిసరి కలిగి ఉండాలని, వాహన పత్రాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ,మన పెద్దలు దిన దిన గండం అనేవారు అది ఎంత మాత్రమొ తెలియదు కానీ! ప్రస్తుత రోజుల్లో మాత్రం అడుగడుగునా వాహనదారులకు పోలీస్ తనకిలేనని వారు అన్నారు. పది రూపాయల వస్తువుకు వంద రూపాయలు అన్నట్టు వాహన పత్రాలు, హెల్మెట్ లేని కారణంగా అంతకు పదింతలు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని వారు తెలిపారు.లక్షల రూపాయలు పెట్టి వాహనాలు అయితే కొంటున్నారు కానీ! దాని తర్వాత వాహన పత్రాలు సక్రమంగా కలిగి ఉండటంలో నిర్లక్ష్యం వహించటం సరికాదని వారు తెలిపారు.
నూతన సంవత్సరం కానుకగా మీ కుటుంబాలలోని బంధుమిత్రుల వాహనదారులకు వాహన పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేవో చూసి నూతన సంవత్సర కానుకగా వారికి ఆయా పత్రాలను హెల్మెట్ లను బహుమతిగా అందించగలరని, వారు కోరారు.
వాహన పత్రాల వల్ల అనేక లాభాలు కలిగి ఉన్నాయని ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు వాహన పత్రాల ప్రాముఖ్యత అత్యధికంగా ఉంటుందని, మనకు లేదా మన వలన ఎదుటి వారికి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం ఆయా కంపిణీలు ఇన్సూరెన్స్ మంజూరు చేస్తుందని అలాగే వాహనానికి ఏదైనా డ్యామేజ్ ఐతే ఇన్సూరెన్స్ ద్వారా తిరిగి ఆ యొక్క రుణా మొత్తాన్ని పొందవచ్చునని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో, బాబు లింగమయ్య, స్రవంతి, అమృత, పావని, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags: Drive vehicles with vehicle documents332
